యాపిల్ ఐఫోన్ 4 మరోసారి మార్కెట్లోకి@రూ.22,900

Posted By:

యాపిల్ ఐఫోన్ 4 మరోసారి మార్కెట్లోకి@రూ.22,900

దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్‌కు సవాల్ విసురుతూ కుపర్టినో కంపెనీ యాపిల్ కార్పొరేషన్ ఐఫోన్4 8జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో మరోసారి విడుదల చేసింది. మార్కెట్లో ఐఫోన్ 4తాజా ధర రూ.22,900. యాపిల్ ఐఫోన్ 4ను ముందుగా 2010లో విడుదల చేసారు. అప్పటి ధర రూ.26,000.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

ఇండియన్ మార్కెట్లో రెండవసారి విడుదలవుతున్న 8జీబి వర్షన్ యాపిల్ ఐఫోన్ 4 ధర రూ.15,000 ఉంటుందని ఇటీవల ఓ ఆంగ్ల వార్త పత్రిక వెల్లడించింది. అయితే ఆ వార్త పుకారుమాత్రమేనని తాజాగా వెల్లడవుతోంది. ఇక ఐఫోన్ 4 కీలక స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే.... 1గిగాహెట్జ్ సింగిల్ కోర్ కార్టెక్స్-ఏ8 సీపీయూ, పవర్ వీఆర్‌ఎస్ జీఎక్స్535 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 512 ఎంబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1420ఎమ్ఏహెచ్ లై-పో బ్యాటరీ, 3.5 అంగుళాల ఐపీఎస్ ఎల్ సీడీ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ద్యం 640 x 960పిక్సల్స్).

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

ఈ సీజన్‌లో యాపిల్ ఐఫోన్ 4ను సొంతం చేసుకోవాలనుకునేవారి కోసం అందుబాటులో ఉన్న 7 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాం. క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot