ఇండియాకి నవంబర్ 25న యాపిల్ ఐపోన్ 4ఎస్ రాక..

Posted By: Super

ఇండియాకి నవంబర్ 25న యాపిల్ ఐపోన్ 4ఎస్ రాక..

 

భారత సెల్యులర్ నెట్ వర్క్ ఎయిర్ సెల్ అధికారకంగా 'ఐపోన్ 4ఎస్'ని నవంబర్ 25(శుక్రవారం)న ప్రవేశపెట్టనున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రికలో ఓ కధనం ప్రచురింపబడింది. దీనితో పాటు ఇండియాలో అధికారకంగా ఐపోన్‌ని విడుదల చేసే భారతీ ఎయిర్ టెల్ కూడా త్వరలో ఇండియాలో ఐపోన్ 4ఎస్ ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం. దేశం మొత్తం మీద ఉన్నటువంటి భారతీ ఎయిర్ టెల్ స్టోర్స్ ఐఫోన్ 4ఎస్ విడుదల రోజుని రాత్రి 12 గంటల వరకు తెరిచే ఉండనున్నాయని సమాచారం.

'ఐపోన్ 4ఎస్' కి సంబంధించిన ఆఫీసియల్ టీజర్‌ని ఎయిర్ టెల్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పోస్ట్ చేయడం జరిగింది. ఐఫోన్ 4ఎస్ ని ఇండియాలో అధికారకంగా ఎప్పుడు విడుదల చేయనున్నామనే సంగతిని కూడా ట్విట్టర్‌లో పోస్ట్ చేసినప్పటికీ, శనివారం నవంబర్ 25న అధికారకంగా ఇండియాలో ఐఫోన్ 4ఎస్ ని విడుదల చేస్తున్నామని ప్రకటించింది.

ఎవరైతే ఐఫోన్ 4ఎస్ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో ఆ యూజర్స్ నవంబర్ 18వ తారీఖు నుండి ఈ వెబ్ సైట్ (http://www.aircel.com/AircelWar/appmanager/aircel/delhi?_nfpb=true&_pageLabel=P32800172221321001090208) ద్వారా ముందుగా ఆర్డర్ చేసుకొవాలని తెలిపింది. ఐతే ఇండియాలో ఐఫోన్ 4ఎస్ మొబైల్ ధర ఎంత ఉండబోతుందనేది ఎయిర్ సెల్, ఎయిర్ టెల్ గానీ అధికారకంగా ప్రకటించక పోవడం ఇక్కడ విశేషం.

అన్‌లాక్ ఐఫోన్ 4ఎస్ అమెరికాలో $649 లభిస్తుండగా, అదే ఇండియాలో సుమారు రూ 35,000 నుండి రూ 40,000వరకు ఉండవచ్చునని అంచనా. ఇది కేవలం 16జిబిని మాత్రమే కలిగి ఉంటుంది. ఐఫోన్ 4ఎస్ ని యాపిల్ కంపెనీ అమెరికా, యూరప్ దేశాలలో అక్టోబర్ 14న విడుదల చేసిన విషయం తెలిసిందే. స్టీవ్ జాబ్స్ మరణాంతరం యాపిల్ విడుదల చేసిన మొట్టమొదటి యాపిల్ ఉత్పత్తి ఐపోన్ 4ఎస్ కావడం విశేషం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot