ఆపిల్ ఐఫోన్ 5 ఇండియాలో ఎప్పుడు..?

టెక్ మీడియా ప్రపంచానికి రాబోయే సెప్టంబర్ చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ఆపిల్, సామ్‌సంగ్, నోకియా వంటి దిగ్గజాలు తమ తమన నూతన గ్యాడ్జెట్‌లను ఆవిష్కరించనున్నాయి. సెప్టంబర్ 12న ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ‘ఐఫోన్ 5’ తన ముఖాన్ని ప్రపంచానికి చూపనుంది. ఈ వేడుక పై ప్రధాన మార్కెట్‌లలో ఒకటిగా పరిగణించబడే భారత్ ఆత్రుతతో ఉంది. ఇందుకు కారణం దేశీయ మార్కెట్లో ఆపిల్ అభిమానులు ఎక్కువగా ఉండటమే.
తాజా రిపోర్టులు ఏం చెబుతున్నాయ్..?
ప్రముఖ టెక్ పోర్టల్ బీజీఆర్ వెల్లడించిన సమాచారం మేరకు ‘ఆపిల్ ఐఫోన్ 5’ను నవంబర్ 13, దిపావళీ కానుకగా భారత్‌లో విక్రయించనున్నారు. ఎయిర్‌టెల్ ఇంకా ఎయిర్‌సెల్ రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్ విక్రయాలు జరగనున్నాయి.
ఆపిల్ ఐఫోన్ 5 ఫీచర్లు (అంచనా):
4 అంగుళాల నాజూకైన టచ్‌స్ర్కీన్,
షార్ప్ రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్),
ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం,
సురక్షితమైన గొరిల్లా గ్లాస్,
లిక్విడ్ మెటల్ బ్యాక్ ప్లేట్,
19పిన్ మినీ డాక్‌కనెక్టర్,
ఆపిల్ ఐవోఎస్ 6 ఆపరేటింగ్ సిస్టం,
ఎన్ఎఫ్ సీ ఫీచర్,
నానో సిమ్,
క్వాడ్‌కోర్ ఏ6 ఆర్మ్ ప్రాసెసర్,
క్వాల్కమ్ 4జీ ఎల్‌టీఈ చిప్,
క్వాల్కమ్ ఎన్ఎఫ్‌సీ చిప్,
1జీబి ర్యామ్,
12మెగా పిక్సల్ సోనీ కెమెరా.


Click it and Unblock the Notifications








