ఆపిల్ ఐఫోన్ 5 Vs ఆపిల్ ఐఫోన్ 4ఎస్

By Prashanth
|
iPhone


బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆపిల్ వర్గాలు తమ 6వ తరం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5ను ఆవిష్కరించాయి. పలుదేశాల్లో ఐఫోన్ 5 విక్రయాలు ఈ నెల21 నుంచి ప్రారంభమవుతున్నప్పటికి ఇండియన్ మార్కెట్లో మాత్రం దీపావళి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఐఫోన్ 4ఎస్ ధరకే ఐఫోన్ 5 లభ్యంకాబోతోంది. ఆండ్రాయిడ్ ఇంకా విండోస్ 8 స్మార్ట్‌ఫోన్‌లకు ఐఫోన్ 5 ప్రధాన పోటీదారు కానుంది. ఐఫోన్ 5తో పోటీపడే స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో గెలాక్సీ ఎస్3, హెచ్‌టీసీ వన్ఎక్స్, నోకియా లుమియా 920ల పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి.

 

గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే ‘ఐఫోన్ 4ఎస్’ వేగవంతమైన ప్రాసెసర్ అదేవిధంగా అత్యుత్తమ యూజర్ ఇంటర్ ఫేస్ ఇంకా సిరీ వాయిస్ కమాండ్ అప్లికేషన్‌ను కలిగి ఉత్తమశ్రేణి స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఏదేమైనప్పటికి ‘ఐఫోన్ 5’ అధికారిక లాంచ్ అనంతరం ఐఫోన్4ఎస్ యూజర్లు కొత్త ఆపిల్ ఫోన్ కొనుగోలు విషయంలో సందిగ్థంలో పడ్డారు. ఈ నేపధ్యంలో ఐఫోన్ 5 అదేవిధంగా ఐఫోన్4ఎస్ స్పెసిఫికేషన్‌ల మధ్య వృత్యాసాన్ని క్లుప్తంగా పరిశీలిద్దాం....

 

బరువు ఇంకా చుట్టుకొలత:

ఐఫోన్5 బరువు కేవలం 112 గ్రాములే, చుట్టుకొలత 123.8 x 58.6x 7.6మిల్లీ మీటర్లు. ఐఫోన్4ఎస్ బరువు 140 గ్రాములు చుట్టుకొలత 115.2 x 58.6 x 9.3మిల్లీమీటర్లు. ఐఫోన్5 నిర్మాణంలో భాగంగా ఆల్యూమినియమ్ ఇంకా గ్లాస్ పదార్ధాన్ని ఉపయోగించారు.

డిస్‌ప్లే:

ఐఫోన్ 5 పెద్దదైన 4అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1136 x 640మెగాపిక్సల్స్. రెటీనా డిస్‌ప్లే లోపించింది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇంకా ఓలియోఫోబిక్ కోటింగ్. మరో వైపు ఐఫోన్ 4ఎస్ 3.5 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రిసల్యూషన్ సామర్ధ్యం 960 x 640పిక్సల్స్. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇంకా ఓలియోఫోబిక్ కోటింగ్.

Read In English

ప్రాసెసర్:

ఐఫోన్5లో ఆపిల్ ఏ6 చిప్‌సెట్‌ను వినియోగించారు. ఐఫోన్ 4ఎస్‌లో నిక్షిప్తం చేసిన ఏ5 చిప్‌సెట్‌తో పోలిస్తే ఇది శక్తివంతమైనది.

ఆపరేటింగ్ సిస్టం:

ఐఫోన్5, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఐఫోన్ 4ఎస్‌లో నిక్షిప్తం చేసిన ఐవోఎస్ 5 ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌తో పోలిస్తే ఐవోఎస్6 మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. 200 కొత్త ఫీచర్లను ఐవోఎస్6 సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: ఐఫోన్ 5 ఇంకా ఐఫోన్ 4ఎస్ సమానమైన 8 మెగాపిక్సల్ రేర్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటాయి. ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్, హెచ్‌డిఆర్ వంటి ఫీచర్లు అదనం. ఈ కెమెరాల ద్వారా వీడియోలను హైడెఫినిషిన్ శ్రేణిలో రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ 5లో ఏర్పాటు చేసిన కెమెరా హైబ్రీడ్ ఐఆర్ ఫిల్టర్, బ్యాక్ సైడ్ ఇల్యూమినేషన్, ఫైవ్ ఎలిమెంట్ లెన్స్, f/2.4 ఎపర్చరు, స్పాటియల్ నాయిస్ రిడక్షన్, డైనమిక్ లో-లైట్ మోడ్, వేగవంతమైన ఫోటో క్యాప్చుర్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది. వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు ఐఫోన్ 5 ముందుభాగంలో 1.3మెగాపిక్సల్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

స్టోరేజ్: ఐఫోన్ 5 అదేవిధంగా 4ఎస్‌లు 1జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి 16GB/32GB/64GB మెమరీ వేరియంట్‌లలో లభ్యమవుతాయి.

కనెక్టువిటీ ఫీచర్లు :

ఐఫోన్5: డీసీ - హెచ్‌ఎస్‌డీపీఏ 42 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపిఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, వై-ఫై ప్లస్ సెల్యులర్, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ 2.0.

ఐఫోన్ 4ఎస్: హెచ్‌ఎస్‌డీపీఏ 14.4 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.8 ఎంబీపీఎస్, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:

ఐఫోన్5లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ 225 గంటల స్టాండ్‌బై ఇంకా 8 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. ఐఫోన్ 4ఎస్‌లో నిక్షిప్తం చేసిన 1432 ఎమ్ఏహెచ్ లిపో బ్యాటరీ 200 గంటల స్టాండ్‌బైతో పాటు 8 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్ ఫీచర్లు:

ఐఫోన్5లో నిక్షిప్తం చేసిన ఐవోఎస్6 మొబైల్ ప్లాట్‌ఫామ్ డిక్షనరీ ఎవ్రీవేర్, ఐట్యూన్స్ సింక్రనేజేషన్, ఆడ్వాన్సుడ్ గెస్ట్యర్స్, న్యూ గేమ్ సెంటర్, ఐక్లౌడ్ క్లౌడ్ స్టోరేజ్, న్యూస్ స్టాండ్, న్యూ కెమెరా అప్లికేషన్, డీప్ ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ ఇంటిగ్రేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లతో లోడై ఉంది.

ధరలు:

ఐఫోన్ 5.. 16జీబి వర్షన్ ధర రూ.11,000. 32జీబి వర్షన్ ధర రూ.16,500, 32 జీబి వర్షన్ ధర రూ.22,000. ఐఫోన్ 5 ధరలు ఐఫోన్ 4ఎస్‌తో సమానంగా ఉన్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X