ఆపిల్ vs హెచ్‌టీసీ!

By Prashanth
|
Apple iPhone 5 vs HTC One X


సెప్టంబర్ 12, ఆపిల్ ఐఫోన్ 5 ఆవిష్కరణ నాటి నుంచి టెక్ ప్రపంచంలో విశ్లేషణల జోరు ఊపందుకుంది. ఆపిల్ కొత్తతరం స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5ను ఇతర ఆండ్రాయిడ్, విండోస్ స్మార్ట్‌ఫోన్‌లతో విశ్లేషిస్తూ ఆయా గ్యాడ్జెట్‌ల నైపుణ్యాల పట్ల వినియోగదారులకు అవగాహన కలిగించే కార్యక్రమానికి ప్రముఖ టెక్ పోర్టల్ ‘గిజ్‌బాట్’ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆపిల్ ఐఫోన్ 5 vs హెచ్‌టీసీ వన్‌ఎక్స్ అనే ప్రతేక్య శీర్షికతో నేటి కధనాన్ని మీకందిస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్ తయారీ విభాగంలో ఆపిల్, హెచ్‌టీసీ‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ నేపధ్యంలో ఆపిల్ ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్5కు, హెచ్‌టీసీ ఇప్పటికే విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ వన్ఎక్స్ గట్టిపోటీనివ్వగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విశ్లేషకులు అంచనా వేసిన వైర్‌లెస్ ఛార్జింగ్, ఎన్‌ఎఫ్‌సీ, రెటీనా డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఐఫోన్5లో లోపించటంతో ఈ పోటీ మరింత రసవత్తరంగా మారింది.

Read In English

బురువు, చుట్టుకొలత:

ఐఫోన్5: 123.8 x 58.6 x 7.6మిల్లీమీటర్లు, బరువు 112 గ్రాములు,

వన్ఎక్స్: 134.8 x 69.9 x 8.9మిల్టీమీటర్లు, బరువు 130 గ్రాములు,

డిస్‌ప్లే:

ఐఫోన్5: 4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్ లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్), 326పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

వన్ ఎక్స్: 4.7 అంగుళాల సూప్ ఎల్‌సీడీ 2 కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), 313 పీపీఐ పిక్సల్ డెన్సిటీ,

ప్రాసెసర్:

ఐఫోన్5: ఆపిల్ ఏ6 చిప్‌సెట్,

వన్ఎక్స్: క్వాడ్‌కోర్ ఎన్-విడియా టెగ్రా3 చిప్‌‌సెట్,

ఆపరేటింగ్ సిస్టం:

ఐఫోన్ 5: సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐవోఎస్6’పై రన్ అవుతుంది. ఈవోఎస్ 200 కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. వీటిలో ఆపిల్ మ్యాప్స్, అప్‌డేటెడ్ సిరీ, సరికొత్త సఫారీ అప్లికేషన్, ఐక్లౌడ్ స్టోరేజ్, ఫోటో స్ట్రీమ్ అప్లికేషన్, పాస్‌బుక్ అప్లికేషన్ వంటివి ప్రత్యేకమైనవి.

వన్ ఎక్స్: ఆండ్రాయిడ్ 4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ (ఆండ్రాయిడ్ జెల్లీబీన్ అప్‌గ్రేడబుల్), ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ప్రాజెక్ట్ బట్టర్, ఆన్-స్ర్కీన్ నేవిగేషన్, ఆండ్రాయిడ్ బీమ్ వంటి సరికొత్త అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది.

కెమెరా:

ఐఫోన్5: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(బ్యాక్‌సైడ్ ఇల్యూమినేషన్, హెచ్‌డిఆర్, ఎఫ్/2.4 ఆపర్చర్, స్పాటియల్ నాయిస్ రిడక్షన్, డైనమిక్ లోలైట్ మోడ్, పానోరమా మోడ్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ టిటెక్షన్), 1.3 మెగా పిక్సల్ ఫ్ఱంట్ కెమెరా (వీడియో కాలింగ్).

వన్ఎక్స్: 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా(ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ టిటెక్షన్), 1.3 మెగా పిక్సల్ ఫ్ఱంట్ కెమెరా (వీడియో కాలింగ్).

స్టోరేజ్:

ఐఫోన్5: 16,32,64జీబి మెమరీ కాన్ఫిగరేషన్స్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

వన్ఎక్స్: 16జీబి ఇంటర్నల్ మెమెరీ, 1జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:

ఐఫోన్5: ఐఫోన్5 కనెక్టువిటీ ఫీచర్లు- డీసీ – హెచ్‌ఎస్‌డీపీఏ 42 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపిఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, వై-ఫై ప్లస్ సెల్యులర్, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ 2.0.

వన్ఎక్స్: వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ ఏ2డీపీ సౌలభ్యతతో, యూఎస్బీ 2.0,

బ్యాటరీ:

ఐఫోన్5: లిపో బ్యాటరీ (225 గంటల స్టాండ్‌బై, 8 గంటల టాక్‌టైమ్),

హెచ్‌టీసీ వన్‌ఎక్స్: 1800ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ టాక్‌టైమ్ 8 గంటలు,

ధర:

ఐఫోన్5: ఇండియన్ మార్కెట్లో అంచనా ధర రూ.50,000.

వన్ ఎక్స్: ధర రూ.36,099.

తీర్పు:

నేటి తరం కోరుకునే ఎన్‌ఎఫ్‌సీ ఫీచర్ ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో లోపించింది. వన్ ఎక్స్‌లో నిక్షిప్తం చేసిన బీట్స్ ఆడియో ఫీచర్ యూజర్‌లను మరింత ఆకర్షిస్తుంది. ధర ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే యూజర్ హెచ్‌టీసీ వన్ ఎక్స్ వైపే మగ్గు చూపే అవకాశముంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X