ఆపిల్ ఐఫోన్5 Vs సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3!

By Prashanth
|
Apple iPhone 5 Vs Samsung Galaxy S3


టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఎట్టకేలకు ఐఫోన్5ను ఆవిష్కరించింది. శక్తివంతమైన ప్రాసెసర్ అదేవిధంగా పెద్దదైన డిస్‌ప్లే వంటి ప్రత్యేకతలతో ఈ నెల 21 నుంచి అందుబాటులోకి రాబోతున్న ఈ అధికముగింపు స్మార్ట్‌ఫోన్, సౌత్ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ రూపొందించిన గెలాక్సీ ఎస్3కు ఏస్థాయిలో పోటీనివ్వగలదన్న అంశాలను క్లుప్తంగా పరిశీలిద్దాం.

చుట్టుకొలత ఇంకా బరువు: ఐఫోన్ 5 123.8 x 58.6 x 7.6మిల్లీ మీటర్లు చుట్టుకొలతను కలిగి ఉంటుంది. బరువు 112 గ్రాములు. గెలాక్సీ ఎస్3 136.6 x 70.6 x 8.6మిల్లీ మీటర్ల చుట్టుకొలతను కలిగి 133గ్రాముల బరువును సంతరించుకుంది.

డిస్‌ప్లే: ఐఫోన్5 పెద్దదైన 4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్లిట్ ఐపీఎస్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1136 x 640పిక్సల్స్. మరో వైపు గెలాక్సీ ఎస్3 4.8 అంగుళాల ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720పిక్సల్స్.

ప్రాసెసర్:

ఐఫోన్5లో శక్తివంతమైన ఆపిల్ ఏ6 చిప్‌సెట్‌ను అమర్చారు. మరో వైపు గెలాక్సీ ఎస్3 ఎక్సినోస్ 4412 క్వాడ్ చిప్‌సెట్ పై రన్ అవుతుంది.

ఆపరేటింగ్ సిస్టం:

ఐఫోన్ 5, ఆపిల్ సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘ఐవోఎస్6’పై రన్ అవుతుంది. మరోవైపు గెలాక్సీ ఎస్3 ఆండ్రాయిడ్ 4.0.4 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఈ వోఎస్ త్వరలో ఆండ్రాయిడ్ 4.1.1 జెల్లీబీన్‌కు అప్‌డేట్ అయ్యే అవకాశముంది. ఐఫోన్5లో లోడ్ చేసిన ఐవోఎస్6 మొబైల్ ప్లాట్‌ఫామ్ 200 కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. వీటిలో ఆపిల్ మ్యాప్స్, అప్‌డేటెడ్ సిరీ, సరికొత్త సఫారీ అప్లికేషన్, ఐక్లౌడ్ స్టోరేజ్, ఫోటో స్ట్రీమ్ అప్లికేషన్, పాస్‌బుక్ అప్లికేషన్ వంటివి ప్రత్యేకమైనవి. మరో వైపు ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం ప్రాజెక్ట్ బట్టర్, ఆన్-స్ర్కీన్ నేవిగేషన్, ఆండ్రాయిడ్ బీమ్ వంటి సరికొత్త అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది.

కెమెరా:

ఐఫోన్5లో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా బ్యాక్‌సైడ్ ఇల్యూమినేషన్, హైబ్రీడ్ ఐఆర్ ఫిల్టర్, ఫైవ్ ఎలిమెంట్ లెన్స్, f/2.4 ఆపర్చర్, స్పాటియల్ నాయిస్ రిడక్షన్, డైనమిక్ లోలైట్ మోడ్, ఫాస్ట్ ఫోటో క్యాప్చుర్, ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్, ఫేస్ డిటెక్షన్ వంటి ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుంది. గెలాక్సీ ఎస్3లో ఏర్పాటు చేసిన 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా వ్యవస్ధ ఆటోఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, జియో-ట్యాగింగ్, టచ్ ఫోకస్, ఫేస్ డిటెక్షన్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికొస్తే గెలాక్సీ ఎస్3, 1.9మెగాపిక్సల్ సామర్ధ్యం గల కెమెరాను కలిగి ఉండగా ఐఫోన్ 5 కేవలం 1.3 మెగా పిక్సల్ కెమెరాతో సరిపెట్టింది.

స్టోరేజ్: ఐఫోన్5 అదేవిధంగా గెలాక్సీ ఎస్3లు 16జీబి, 32జీబి, 64జీబి మెమరీ కాన్ఫిగరేషన్ లలో లభ్యం కానున్నాయి. ఐఫోన్ 5 1జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉండగా, గెలాక్సీ ఎస్3 2జీబి ర్యామ్ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా గెలాక్సీ ఎస్3 మెమరీని మరింత పొడిగించుకోవచ్చు.

కనెక్టువిటీ:

ఐఫోన్5 కనెక్టువిటీ ఫీచర్లు- డీసీ – హెచ్‌ఎస్‌డీపీఏ 42 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌డిపిఏ 21 ఎంబీపీఎస్, హెచ్‌ఎస్‌యూపీఏ 5.76 ఎంబీపీఎస్, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 802.11 a/b/g/n, వై-ఫై ప్లస్ సెల్యులర్, బ్లూటూత్ వీ4.0, మైక్రోయూఎస్బీ 2.0.గెలాక్సీ ఎస్3 కనెక్టువిటీ ఫీచర్లు: హెచ్‌ఎస్‌డీపీఏ, హెచ్‌ఎస్‌యూపీఏ, ఎన్ఎఫ్ సీ, వై-ఫై 802.11 a/b/g/n, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ విత్ ఏ2డీపీ, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:

ఐఫోన్5లో నిక్షిప్తం చేసిన బ్యాటరీ 225 గంటల స్టాండ్‌బై ఇంకా 8 గంటల టాక్‌టైమ్‌ను అందిస్తుంది. గెలాక్సీ ఎస్3లో ఏర్పాటు చేసిన 2100 ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ 11.5టాక్ టైమ్, 790 గంటల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

ధరలు:

ఐఫోన్ 5.. 16జీబి వర్షన్ ధర రూ.11,000. 32జీబి వర్షన్ ధర రూ.16,500, 32 జీబి వర్షన్ ధర రూ.22,000. గెలాక్సీ ఎస్3.. 16జీబి వర్షన్ ధర రూ.36,900, 32జీబి వర్షన్ ధర రూ. 38900.

తీర్పు:

నియర్ ఫీల్డ్ టెక్నాలజీ (ఎన్ఎఫ్‌సీ) వంటి ఆధునిక పరిజ్ఞానం ఐఫోన్5లో లోపించింది. ఐఫోన్5లో లోడ్ చేసిన ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం 7లక్షలకు పైగా అప్లికేషన్‌లను సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ విషయంలో ఈ రెండు ఫోన్‌లు ఇంచుమించు సమాన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తున్నాయి. రేర్ కెమెరా విభాగంలో సరికొత్త ఫీచర్లతో ఐఫోన్ 5, గెలాక్సీఎస్3ని అధిగమించిగా, ఫ్రంట్ కెమెరా విభాగంలో ఆధునిక వీడియో కాలింగ్ ఫీచర్‌తో ఐఫోన్5ను గెలాక్సీ ఎస్3 అధిగమించింది. ఎన్ఎఫ్‌సీ, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎస్ బీమ్ వంటి ప్రత్యేక పైలెట్ సాఫ్ట్‌వేర్‌లు గెలాక్సీ ఎస్3లో ఉన్నాయి. అంతిమంగా, యూజర్ తన అవసరాలను బట్టి వీటిని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X