Home
Mobile

మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ 5సీ (8జీబి వర్షన్)

కాలిఫోర్నియాకు చెందిన కుపర్టినో టెక్ దిగ్గజం యూపిల్ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్ 5సీకి సంబంధించి 8జీబి వేరింయంట్‌ను తాజాగా ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తోంది. దేశీయ మార్కెట్లో యాపిల్ ఐపోన్ 5సీ నిర్థేశిత ధర రూ.37,500. అయితే, యాపిల్ ఫోన్ కొనుగోలు పై రూ.3,000 ధర తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన ధర రాయితీలో భాగంగా ఇండియన్ యాపిల్ ఫ్యాన్స్ ఐఫోన్ 5సీ (8జీబి వర్షన్)ను రూ.34,500కు సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఫోన్ కొనుగోలు పై రూ.2,300 విలువ చేసే యాపిల్ ఐఫోన్ 5సీ కేస్‌ను కంపెనీ ఉచితంగా అందిస్తోంది.

మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ 5సీ (8జీబి వర్షన్)

ఐఫోస్ 5సీ కీలక స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్తఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ ఎన్, బ్లూటూత్ 4.0.

యాపిల్ నుంచి గతేడాది విడుదలైన ప్రీమియమ్ మోడల్ ఐఫోన్ ‘యాపిల్ ఐఫోన్ 5సీ'ను ఇప్పుడు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.7,500 డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకునే అవకాశాన్ని యాపిల్ ఇండియా కల్పిస్తోంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియగదారులు వర్కింగ్ కండీషన్‌లో ఉన్న తమ పాత స్మార్ట్‌ఫో్న్‌లను సమీపంలో ఉన్న యాపిల్ ప్రీమియమ్ రిసెల్లర్ వద్దకు తీసుకువెళ్లి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఆ పాత హ్యాండ్‌సెట్‌కు బదులుగా రూ.7,500 ధర డిస్కౌంట్‌తో కూడిన యాపిల్ ఐఫోన్ 5సీని సొంతం చేసుకోవచ్చు. ఈ లిమిటెడ్ పిరియడ్ బుయ్ బ్యాక్ ఆఫర్ మే1, 2014 నుంచి మే 30, 2014 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐఫోన్ 5సీ కోనుగోలు పై స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.2,100 క్యాష్‌బ్యాక్‌ను యాపిల్ ఆఫర్ చేస్తున్నట్లు ఫోన్‌అరీనా తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X