రూ.3,999కే ఐఫోన్ 6, Flipkart ఆఫర్ ఇదే

యాపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా..? అయితే, మీకోసం ఓ బెస్ట్ ఆఫర్ సిద్ధంగా ఉంది. యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్‌లో ఒకటైన ఐఫోన్ 6 పై ఈ-కామర్స్ దిగ్గజం Flipkart ఓ ఆసక్తికర ఎక్స్‌ఛేంజ్ స్కీమ్‌ను అనౌన్స్ చేసింది.

రూ.3,999కే ఐఫోన్ 6,  Flipkart ఆఫర్ ఇదే

Read More : 5000mAh బ్యాటరీతో 4G VoLTE ఫోన్ లాంచ్ అయ్యింది

ఈ ఆసక్తికర ఆఫర్‌లో భాగంగా కండీషన్‌లో ఉన్న మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వద్ద ఎక్స్‌ఛేంజ్ చేసినట్లయితే ఫోన్ క్వాలిటీ ఇంకా పనితీరును బట్టి రూ.24,000 వరకు రాయితీ లభిస్తుంది. ఇప్పుడు మీరు కేవలం రూ.3,999 చెల్లించినట్లయితే యాపిల్ ఐఫోన్ 6 (16జీబి, స్పేస్ గ్రే కలర్ వేరియంట్) మీ సొంతమవుతుంది. ఒకవేళ మీరు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వద్దనుకుంటున్నట్లయితే రూ.9,000 ఫ్లాట్ డిస్కౌంట్ మీకు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5% వరకు అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రూ.3,999కే ఐఫోన్ 6,  Flipkart ఆఫర్ ఇదే

Read More : అంతరిక్షంలోకి ఒకేసారి 104 శాటిలైట్‌లు, ఇస్రో చరిత్ర సృష్టించబోతోందా..?

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు.. ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ)‌,ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

Read More : రూ.49కే నెలంతా కాల్స్

English summary
Apple iPhone 6 available for Rs 3,999 on Flipkart in exchange offer. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot