అక్టోబర్ 14న యాపిల్ ఐఫోన్ 6

Posted By:

యాపిల్ తరువాతి వర్షన్ ఐఫోన్, యాపిల్ ఐఫోన్ 6 విడుదలకు సంబంధించి ఆసక్తికర రూమర్లు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన మ్యాక్‌రూమర్స్ నివేదిక ప్రకారం అక్టోబర్ 14న నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఐఫోన్ 6ను ఆవిష్కరించనున్నారట. మునుపటి నివేదికల్లో ఐఫోన్6 ఆవిష్కరణ తేదీని సెప్టంబర్ 16గా పేర్కొనటం జరిగింది.

 అక్టోబర్ 14న యాపిల్ ఐఫోన్ 6

యాపిల్ స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఇటీవల కాలంలో యాపిల్ ఫోన్‌లను క్లోనింగ్ బెడదు బెంబేలెత్తిస్తోంది. మరో రెండు నెలల్లో విడుదల కాబోతున్న ఐఫోన్ 6కు సంబంధించి క్లోన్ డివైస్‌లు చైనా మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయంటూ వెబ్ ప్రపంచంలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఐఫోన్ 5ఎస్‌తో పోలిస్తే త్వరలో విడుదల కాబోయే ఐఫోన్ 6 అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెద్దదైన తెర, శక్తివంతమైన ప్రాసెసింగ్ వ్యవస్థ వంటి అంశాలు ఈ ఫోన్ అమ్మకాలకు మరింత అనుకూలించే అవకాశముందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

యాపిల్ ఐపోన్ 5ఎస్ సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6 పై ఇప్పటికే అనేక ఆసక్తికర వార్తలు వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తున్నాయి. ఐఫోన్ 5ఎస్‌తో ఫింగిర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్‌ను పరిచయం చేసిన యాపిల్ ఐఫోన్ 6లో సోలార్-ఛార్జింగ్ సఫైర్ గ్లాస్ స్ర్కీన్‌ను నిక్షిప్తం చేస్తున్నట్లు ప్రముఖ విశ్లేషకుడు మాట్ మార్గోలిస్ ఇటీవల ఓ కథనంలో పేర్కొన్నారు.

ఈ ఫీచర్‌ను పొందుపరచటం ద్వారా ఐఫోన్ 6 బ్యాటరీ లైఫ్ మరింత పెరుగుతుందట. అయితే ఈ అంశానికి సంబంధించి యాపిల్ వర్గాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది. తన వార్తకు మరింత బలం చేకూరుస్తూ మాట్ పలు అంశాలను ఈ కథనంలో ఉటంకించారు. టచ్ సెన్సార్స్ ఇంకా సోలార్ ప్యానల్స్ పై యాపిల్ ఫిబ్రవరి 2013లో ఒక పేటెంట్ దాఖలు చేసినట్లు మాట్ ఈ సందర్భంగా గుర్తుచేసారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot