భారత్‌లో అక్టోబర్ 17 నుంచి ఐఫోన్6 అమ్మకాలు

|

కొద్ది గంటల క్రితం యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న భారతీయులకు శుభవార్త. ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలనుఅక్టోబర్ 17 నుంచి ప్రారంభించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. యూఎస్ మార్కెట్లో ఐఫోన్ 6 విక్రయాలు సెప్టంబర్ 19 నుంచి ప్రారంభవుతున్న విషయం తెలిసిందే.

భారత్‌లో అక్టోబర్ 17 నుంచి ఐఫోన్6 అమ్మకాలు

ఇండియన్ మార్కెట్లో యాపిల్ ఐఫోన్ 6 ధరలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది. 2014 ముగింపు నాటికి ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ డివైస్‌లను 115 దేశాల్లో విడుదల చేస్తామని ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా యాపిల్ వెల్లడించింది. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 ఫోన్‌లకు యాపిల్ ఐఫోన్6 గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
Apple iPhone 6 And iPhone 6 Plus Coming To India By October 17. Read more in Telugu Gizbot.....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X