ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ అమ్మకాలు ప్రారంభం, బారులు తీరిన జనం

Posted By:

యాపిల్ కంపెనీ ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు గురువారం అర్థరాత్రి (తెల్లవారితే శుక్రవారం) నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్ ఆథరైజ్డ్ షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి. దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని తొలి విడతలో భాగంగా 55 వేల ఐపోన్ 6 యూనిట్‌లను యాపిల్ అందుబాటులో ఉంచినట్లు సమాచారం. దీంతో వీటిని సొంతం చేసేకునేందుకు అవుట్‌ లెట్‌ల వద్ద యాపిల్ అభిమానులు బారులుతీరారు.

ఐఫోన్ 6 కోసం బారులు తీరిన జనం!

మార్కెట్లో.. యాపిల్ ఐఫోన్ 6 16జీబి మోడల్ ధర రూ.53,500, 64జీబి మోడల్ ధర రూ.62,500, 128జీబి మోడల్ ధర రూ71,500. ఐఫోన్ 6 ప్లస్ 16జీబి మోడల్ ధర రూ.62,500, 64 జీబి మోడల్ ధర రూ.71,500, 128జీబి మోడల్ ధర రూ.80,500

ఐఫోన్ 6, ఐఫోన్ 6+ విడుదల నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఫోన్ ఆథరైజ్డ్ షోరూమ్‌లు యాపిల్ అభిమనులతో కిటకిట లాడాయి. కొత్త వర్షన్ ఐఫోన్‌లు లిమిటెడ్ వర్షన్‌లలో మాత్రమే అందుబాటులో ఉండటంతో జనం ఎగబడ్డారు. వినియోగదారులు సౌకర్యార్థం ఆయా అవుట్ లెట్‌ల నిర్వాహకులు గురువారం రాత్రంతా షోరూమ్‌లను తెరిచే ఉంచారు. హైదరాబాద్‌లోని బజాన్ ఎలక్ట్రానిక్ షోరూంలో ఐఫోన్ 6 విక్రయాలు గురువారం అర్థరాత్రి నుంచి లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

ఐఫోన్ 6ను దక్కించుకున్న ఎంపీ కల్వకుంట్ల కవిత

తమ ఇంట్లో అందరం ఐఫోన్‌లనే వాడతామని, ఐపాడ్‌లనూ వినియోగిస్తామని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం అర్ధరాత్రి బేగంపేటలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గాడ్జెట్ రష్ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఈ ఎక్స్‌పోను కవిత ప్రారంభించారు.

కుమారుడితో కలిసి కార్యక్రమానికి హాజరైన కవిత, కార్యక్రమంలో భాగంగా ఐఫోన్-6ను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఐఫోన్ గురించి మాట్లాడారు. ఐపాడ్ వినియోగం కూడా తమ ఇంటిలో అధికమేన్నారు. ఐఫోన్ ఎప్పుడూ స్ఫూర్తి కలిగించేదేనని, డిజైన్ గురించి మాట్లాడేవారి తొలి ఎంపిక ఐఫోనే అన్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple iPhone 6 and iPhone 6 Plus go on sale in India. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting