దుమ్ములేపిన యాపిల్ ఐఫోన్ 6

Posted By:

యాపిల్ కొత్త ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా అమితమైన ఆదరణ లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి రోజే ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను 40 లక్షల మంది ప్రీ ఆర్డర్ చేసుకున్నట్లు యాపిల్ తెలిపింది. ఐఫోన్ 5తో పోలిస్తే ఈ సంఖ్య రెండితలు అధికం. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ ముందస్తు బుకింగ్‌లు యాపిల్‌కు కొత్త రికార్డులు తెచ్చిపెట్టినట్లు యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయటం ఓ విశేషం.

దుమ్ములేపిన యాపిల్ ఐఫోన్ 6

ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ముందస్తు బుకింగ్‌లు యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్ తదితర ప్రముఖ మార్కెట్‌‌లలో సెప్టంబర్ 12 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాల్లో ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్‌లను బుక్ చేసుకున్న వారికి సెప్టంబర్ 19 నుంచి డెలివరీ ఉంటుంది. 2014 ముగింపు నాటికి ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ డివైస్‌లను 115 దేశాల్లో విడుదల చేస్తామని ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా యాపిల్ వెల్లడించింది. ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 16 నుంచి ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ విక్రయాలు ఉంటాయి. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 ఫోన్‌లకు యాపిల్ ఐఫోన్6 గట్టి పోటీనివ్వనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple iPhone 6, iPhone 6 Plus Receives Record 4 Million Pre-Orders. Read more in Telugu Gizbot.....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting