ప్రీఆర్డర్ పై యాపిల్ ఐఫోన్ 6 ప్లస్@ రూ.1,50,000?

Posted By:

యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణంలో యాపిల్ కంపెనీ ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను కొద్ది రోజుల క్రితం ఆవిష్కరించిన విషయం తెలసిందే. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ముందుస్తు బుకింగ్‌లు ఈ నెల 12 నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, జపాన్ దేశాల్లో ప్రారంభమైన నేపధ్యంలో ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ eBay ఐఫోన్ 6 ప్లస్ 128జీబి వర్షన్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ పై భారతీయులకు అందుబాటులో  ఉంచింది. ఫోన్ ధర రూ.150,000. యాపిల్ పెద్దతెర ఐఫోన్6ను ముందుగా సొంతం చేసుకోవాలనుకునేవారికి ఇదో మంచి తరుణం..

ప్రీఆర్డర్ పై యాపిల్ ఐఫోన్ 6 ప్లస్@ రూ.1,50,000?

ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో ఒకటైన భారత్‌లో ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ విక్రయాలనుఅక్టోబర్ 17 నుంచి ప్రారంభించేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్లు యాపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది. యూఎస్ మార్కెట్లో ఐఫోన్ 6 విక్రయాలు సెప్టంబర్ 19 నుంచి ప్రారంభవుతున్న విషయం తెలిసిందే. 2014 ముగింపు నాటికి ఐఫోన్6, ఐఫోన్6 ప్లస్ డివైస్‌లను 115 దేశాల్లో విడుదల చేస్తామని ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా యాపిల్ వెల్లడించింది. త్వరలో ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 4, సోనీ ఎక్స్‌పీరియా జెడ్ 3 ఫోన్‌లకు యాపిల్ ఐఫోన్6 గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple iPhone 6 Plus Already Up for Sale? 128GB Variant Spotted on eBay for Rs 1.5 Lakh. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot