రూ.9,990కే యాపిల్ ఐఫోన్ 6

యాపిల్ ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్ పై ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఎక్స్ ఛేంజ్ ఆఫర్‌ను అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.31,990 విలువ చేసే ఐఫోన్ 6 ప్లస్ కేవలం రూ.9,990కే మీ సొంతమవుతుంది. యాపిల్ ఐఫోన్ 6 స్పేస్ గ్రే వర్షన్ పై ఏకంగా రూ.22,000 డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.

రూ.9,990కే యాపిల్ ఐఫోన్ 6

Read More : మోడీ రూ. 500 ఉచిత రీఛార్జ్, లింక్ చూసారా..?

EMI పద్దతిలో ఈ ఫోన్ ను కొనుగోలు చేసినవారికి అదనంగదా 5శాతం రాయితీ వర్తిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. అయితే, ఈ భారీ డిస్కౌంట్ అనేది తమ ఐఫోన్ 6ప్లస్‌తో ఐఫోన్ 6ను ఎక్స్‌ఛేంజ్ చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుత మార్కెట్లో ఐఫోన్ 6 (16జీబి వర్షన్) ధర రూ.31,990గా ఉంది.

రూ.9,990కే యాపిల్ ఐఫోన్ 6

Read More : ఈ ఏడాది షియోమి నుంచి దూసుకొస్తున్న ఫోన్లు ఇవే !

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు : ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

English summary
Apple iPhone 6 Selling For as Low as Rs 9,990 on Flipkart. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot