యాపిల్ ఐఫోన్ 6@రూ.56,000

Posted By:

యాపిల్ లేటెస్ట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 6ను రూ.56,000 ధర పరిధిలో అందిస్తామంటూ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 6 విడుదలకు సంబంధించి యాపిల్ ఇప్పటి వరకు ఏ విధమైన అధికారిక ప్రకటనను జారీ చేయలేదు. అయినప్పటికి, పలు ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అక్టోబర్ రెండవ వారం నుంచి యాపిల్ ఐఫోన్ 6ను రూ.56,000 ధర శ్రేణిలో విక్రయిస్తామంటూ ఆన్‌లైన్ షాపర్‍‌లను ఊరిస్తున్నాయి.

యాపిల్ ఐఫోన్ 6@రూ.56,000

ప్రముఖ రిటైలర్ ఈబే (eBay) ఐఫోన్ 6ను ఈ అక్టోబర్ 8 నుంచి ఏ విధమైన డెలివరీ చార్జీలను వసూలు చేయకుండా రూ.55954 ధరకే అందిస్తామని తెలిపింది. ఐఫోన్ 6 ప్లస్ ధరను రూ.77,000 సదరు రిటైలర్ పేర్కొంది. మరో వెండర్ షాప్‌క్లూస్.కామ్ ఐఫోన్ 6 16జీబి వర్షన్‌ను అక్టోబర్ 8 నుంచి రూ.149 డెలివరీ చార్జీలతో కలుపుకుని రూ.59,999 ధరకు విక్రయిస్తామని తెలిపింది.

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).


యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్‌ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple iPhone 6 Starting Price Would Be Rs 56,000 in India. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot