ఇకపై అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 6ఎస్,ఇండియాలో తయారీ !

|

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇండియా మార్కెట్‌పై ఎప్పటినుంచో కన్నేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇండియాలో దూసుకుపోతున్న చైనా కంపెనీ షియోమి, దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీలు తమ బడ్జెట్ ధర ఫోన్లతో ఆపిల్ కంపెనీకి ఇండియాలో అసలైన సవాల్ ఇస్తుండటంతో వాటికి ధీటుగా తక్కువ ధరకే ఫోన్లను తీసుకురావాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఆపిల్ కంపెనీ తన ఐఫోన్ 6ఎస్ ఫోన్‌ను ఇండియాలో తయారుచేసేందుకు ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ఇంకో కారణం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

10 వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్, టచ్ చేసి చూడండి10 వాట్సప్ టిప్స్ అండ్ ట్రిక్స్, టచ్ చేసి చూడండి

 సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి..

సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి..

ఇండియాలో విదేశీ వస్తువులపై అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి మెల్లమెల్లగా ఆపిల్‌ భారత్‌లోనే తమ ఐఫోన్ల ఉత్పత్తిని చేపడుతోంది.

ఐఫోన్‌ ఎస్‌ఈ..

ఐఫోన్‌ ఎస్‌ఈ..

గతేడాది నుంచే ఆపిల్‌ భారత్‌లో తన ఐఫోన్‌ ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడం ప్రారంభించింది. బెంగళూరులో ఈ తయారీ సౌకర్యాన్ని ఏర్పరిచింది.

ఐఫోన్‌ 6ఎస్‌

ఐఫోన్‌ 6ఎస్‌

తాజాగా కొత్త ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ను కూడా భారత్‌లోనే రూపొందించడం ప్రారంభించిందని తెలిసింది. అదీ కూడా బెంగళూరులోని ఐఫోన్‌ ఎస్‌ఈ రూపొందే విస్ట్రోన్‌ ప్లాంట్‌లోనే ఐఫోన్‌ 6 ఎస్‌ను ఆపిల్‌ తయారు చేస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి.

మిడ్‌-రేంజ్‌ ప్రీమియం సెగ్మెంట్‌లోకి
 

మిడ్‌-రేంజ్‌ ప్రీమియం సెగ్మెంట్‌లోకి

భారత మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎక్కువగా అమ్ముడుపోతుండటంతో, ఐఫోన్‌ 6ఎస్‌ ఉత్పత్తినే ఇక్కడ ప్రారంభించాలని ఆపిల్‌ నిర్ణయించిందని తెలిసింది. మిడ్‌-రేంజ్‌ ప్రీమియం సెగ్మెంట్‌లోకి కొంత షేర్‌ను విస్తరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

దిగుమతి సుంకాలు

దిగుమతి సుంకాలు

దీంతో ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌పై దిగుమతి సుంకాలు తగ్గిపోతాయి.ఈ సుంకాలు తగ్గిపోవడంతో, ఐఫోన్‌ 6ఎస్‌ చౌకైన ధరలో భారత వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని రిపోర్టులు పేర్కొన్నాయి.

మేడిన్‌ ఇండియాలో

మేడిన్‌ ఇండియాలో

ఐఫోన్‌ ఎస్‌ఈ మాదిరి మేడిన్‌ ఇండియాలో రూపొందుతున్న ఐఫోన్‌ 6ఎస్‌ను భారత్‌లోనే విక్రయిస్తాం. భారత్‌లో తయారీ సామర్థ్యం పెరిగేంత వరకు ఐఫోన్‌ 6ఎస్‌ దిగుమతులు కొనసాగిస్తాం. 

స్థానిక తయారీ యూనిట్లతో ఎలాంటి ధర కరెక్షన్‌ ఉండదు. త్వరలోనే మేడిన్‌ ఇండియా ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోర్లలోకి వస్తుంది' అని ఆపిల్‌కు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు.

ఐఫోన్‌ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

ఐఫోన్‌ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

ఐఫోన్‌ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు, మొత్తం భారత్‌లో ఐఫోన్‌ అ‍మ్మకాల్లో మూడో వంతు స్థానాన్ని ఆక్రమించుకుని ఉన్నాయని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. ధరలో స్థిరత్వం, పోటీ కోసం కంపెనీ స్థానికంగా తయారీ యూనిట్లను పెంచుతున్నామని ఆపిల్‌ వివరించింది.

Best Mobiles in India

English summary
Apple iPhone 6s to get cheaper in India, its local manufacturing begins more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X