కలకలం రేపుతోన్న ఐఫోన్ 7 ప్లస్ పేలుడు

స్మార్ట్‌ఫోన్‌లు పేలుడుకు గురువటం ఈ మధ్య కాలంలో షరామాములు అయిపోయింది. తాజాగా ఈ జాబితాలోకి ఐఫోన్ 7 ప్లస్ వచ్చి చేరింది. Arizonaలోని టక్సన్ ప్రాంతానికి చెందిన బ్రియన్నా ఆలివాస్ అనే యువతి కరుగుతోన్న స్ధితిలో ఉన్న తన ఐఫోన్ 7 ప్లస్‌కు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

కలకలం రేపుతోన్న ఐఫోన్ 7 ప్లస్ పేలుడు

ఈమె పోస్ట్ చేసిన ఆ వీడియోలో రోజ్ గోల్డ్ ఐఫోన్ 7 ప్లస్ మెటల్ భాగం కురుగిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆ ఫోన్ నుంచి పొగలు కూడా వస్తున్నాయి. ముందుగా తన ఫోన్ స్విచ్ ఆన్ అవ్వకపోవటంతో సర్వీసింగ్ సెంటర్‌కు తీసకువెళ్లానని, వాళ్లు దానిని రిపేర్ చేసి ఇచ్చారని, అంతా బాగుందనుకున్న తరుణంలో మరసటి రోజు ఉదయమే ఫోన్ నుంచి మంటలు వ్యాపించాయని బ్రియన్నా ఓ ప్రముఖ వెబ్‌సైట్‌కు తెలిపింది. పేలుడుకు గురైన ఫోన్‌కు బదులుగా కొత్త ఫోన్‌ను రీప్లేస్ చేసిన యాపిల్ బృందం ఘటన పై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు తెలసింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

సాధ్యమైనంత వరకు బ్రాండెడ్ క్వాలటీ ఫోన్‌నే కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన ఐఎమ్ఈఐ నెంబర్‌ను కలిగి ఉండాలి. అలానే మీరు వినియోగించే ఫోన్‌కు సంబంధించి ఇయర్ ఫోన్స్, బ్యాటరీ ఇంకా ఛార్జర్‌లు మన్నికైనవిగా ఉండాలి.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

సెల్‌ఫోన్ బ్లాస్ట్ అవటానికి ప్రధాన కారణం బ్యాటరీ. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్న సమయంలో మథర్ బోర్డ్ పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కొన్ని ఫోన్‌లలో నాసిరకమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌లను ఉపయోగించటం వల్ల పేలుడు సంభవిస్తుంటుంది.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

సెల్‌ఫోన్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండాలంటే, ఫోన్ చార్జ్ అవుతున్న సమయంలో కాల్స్ రిసీవ్ లేదా డయల్ చేయటం అంత శ్రేయస్కరం కాదు. అంతగా మాట్లాడాలనుకుంటే ఛార్జింగ్ కేబుల్ నుంచి ఫోన్‌లను వేరు చేసి మాట్లాడండి.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

చవక ధర ఫోన్‌‍లలో వినియోగించే కాంపోనెంట్స్ బ్రాండెడ్ క్వాలిటీ కాకపోవటం వల్ల వీటిని ఉపయోగించటం అంతగా మంచిది కాదు. ఒక వేళ వీటిని ఉపయోగించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే, బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించటం మంచిది. ఉబ్బిన బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. వర్షం లేదా చమ్మ తాకిడికి గురైన ఫోన్‌ను ఛార్జ్ చేయటం ప్రమాదకరం. నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండటం వల్ల సెల్‌ఫోన్ ప్రమాదాలను నివారించవచ్చు.

మీ ఫోన్ పేలకుండా ఉండాలంటే..?

నకిలీ మొబైల్ చార్జర్‌లకు దూరంగా ఉండటం వల్ల సెల్‌ఫోన్ ప్రమాదాలను నివారించవచ్చు. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడటం అంటే చావుతో చెలగాటమాడుతున్నట్లే. కాబట్టి, ఆ అలవాటును పూర్తిగా మానుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 7 Plus explodes; Caught on camera. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot