సెప్టంబర్ 22 నుంచి ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ ప్రీ-ఆర్డర్స్

యాపిల్ తన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను కొద్ది గంటల క్రితమే అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. భారత్ లో ఈ ఫోన్ లకు సంబంధించిన అమ్మకాలు సెప్టంబర్ 29 నుంచి ప్రారంభమవుతుండగా, ఇందుకు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ మాత్రమ సెప్టంబర్ 22 నుంచి ప్రారంభమవుతాయని తెలుస్తోంది.

Read More : నాలుగు కెమెరాలతో Infocus Snap 4, ధర రూ.11,999

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3000 స్టోర్‌లలో ప్రీ-బుకింగ్స్

బ్రైట్‌స్టార్ టెలీకమ్యూనికేషన్ ఇండియాతో పాటు రెడ్డింగ్‌టన్ ఇండియాలు ఈ ఫోన్‌లకు సంబంధించి ప్రీ-ఆర్డర్స్ స్వీకరిస్తాయి. దేశవ్యాప్తంగా 3000 స్టోర్‌లలో ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్‌లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ స్వీకరించనున్నట్లు రెడ్డింగ్‌టన్ ఇండియా తెలిపింది.

ధరలు ఈ విధంగా ఉన్నాయి..

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 8 64 జీబి వేరియంట్ ధర రూ.64,000గా ఉంటుంది. 256జీబి వేరియంట్ ధర రూ.77,000. ఐఫోన్ 8 ప్లస్ 64జీబి వేరియంట్ ధర రూ.73,000. 256జీబి వేరియంట్ ధర రూ.86,000.

అక్టోబర్ 27 నుంచి iPhone X ప్రీ-ఆర్డర్స్

స్పెషల్ ఎడిషన్ iPhone Xకు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్‌ను అక్టోబర్ 27 నుంచి స్వీకరించబోతున్నట్లు బ్రైట్‌స్టార్ టెలీకమ్యూనికేషన్ ఇండియా తెలిపింది. మార్కెట్టో ఐఫోన్ ఎక్స్ 64జీబి వేరియంట్ ధర రూ.89,000గా ఉంటుంది.128జీబి వేరియంట్ ధర రూ.1,02,000.

ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 8 64జీబి వేరియంట్ ధర రూ.64,000గా ఉంటుంది. 256జీబి వేరియంట్ దర రూ.77,000గా ఉంటుంది.

ఐఫోన్ 8 ప్లస్ స్సెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్. ఐఫోన్ 8 ప్లస్ 64జీబి వేరియంట్ దర రూ.73,000గానూ, 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86,000గాను ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone 8 and iPhone 8 Plus pre-orders begin from September 22 in India. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot