సరికొత్తగా ఐఫోన్ 8 ఈవెంట్, ఆహ్వానిస్తున్న ఆపిల్

Written By:

మొత్తానికి ఆపిల్ త్వరలో జరగనున్న ఐఫోన్ 10వ వార్షికోత్సవ మెగా ఈవెంట్‌పై స్పందించింది. మార్కెట్‌లో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నా.. ఏం మాట్లాడకుండా నిశబ్దంగా ఉన్న ఆపిల్‌ సెప్టెంబర్‌ 12న జరుగబోతున్న ఈ మెగా ఈవెంట్‌ను గురువారం ధృవీకరించేసింది.

చరిత్రలో తొలిసారి, 512జిబితో ఐఫోన్ 8..

సరికొత్తగా ఐఫోన్ 8 ఈవెంట్, ఆహ్వానిస్తున్న ఆపిల్

ఈ లాంచ్‌ ఈవెంట్‌కు సంబంధించి, ఆహ్వానాలు కూడా పంపుతోంది. కాలిఫోర్నియా, కూపర్టినోలోని తమ కొత్త క్యాంపస్‌లో స్టీవ్‌ జాబ్స్‌ థియేటర్‌లో ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్టు ఆపిల్‌ తన ఆహ్వాన పత్రికల్లో పేర్కొంది. సగం కొరికిన ఆపిల్‌ కలర్‌ఫుల్‌ లోగోతో పాటు మెసేజ్‌ను కంపెనీ అందిస్తోంది.

కొత్త ఐఫోన్ 8 ఇదిగో, ఇలా ఉంటుందట..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చాలా ఢిపరెంట్ గా

ఈ ఆహ్వాన పత్రిక చాలా ఢిపరెంట్ గా కూడా ఉంది. మన ప్రదేశంలో కలుసుకుందాం.. స్టీవ్‌ జాబ్స్‌లో థియేటర్‌లో నిర్వహించబోతున్న తొలి ఈవెంట్‌కు అందరూ రావాలి'' అంటూ ఆహ్వానిస్తోంది.

ఐఫోన్‌ ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌

ఈ లాంచ్‌ ఈవెంట్‌లోనే, ఐఫోన్‌ ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ 8ను లాంచ్‌ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌

ఐఫోన్‌ 8తో పాటు, ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ అప్‌డేటెడ్‌ స్మార్ట్‌ఫోన్లు ఐఫోన్‌ 7ఎస్‌, ఐఫోన్‌ 7ఎస్‌ ప్లస్‌లు లాంచ్‌ చేస్తున్నారని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ఆపిల్‌ కొత్త వాచ్‌ను కూడా ప్రవేశపెట్టబోతున్నారు.

డిస్‌ప్లే

5.8 అంగుళాల డిస్‌ప్లే, ఓలెడ్‌ స్క్రీన్‌తో ఇది మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఐఫోన్‌లో అతిపెద్ద మార్పు ఇదే. హైఎండ్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్లకు ఉన్న మాదిరిగా అత్యంత పలుచనైన బెజెల్స్‌.

ర్యామ్‌

3 జీబీ ర్యామ్‌.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు

కెమెరా

మెరుగైన కెమెరాలు, వెనుకవైపు డ్యూయల్‌ కెమెరా సెటప్‌, 3డీ ఫేస్‌ రికగ్నైజేషన్‌

హోమ్‌ బటన్‌

గతకొన్నేళ్లుగా ఐఫోన్స్‌లో వస్తున్న హోమ్‌ బటన్‌ ఇందులో ఉండదు. శాంసంగ్‌ ఎస్‌8, గూగుల్‌ పిక్సల్‌ మొబైళ్ల తరహాలో వర్చువల్‌ హోమ్‌ బటన్‌ ఉంటుంది.

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌

ఆపిల్‌ వాచ్‌, శాంసంగ్‌ హైఎండ్‌ మొబైల్స్‌లో ఉండే వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని ఇందులో అందిస్తున్నారు.

ధర సుమారు 1000 డాలర్లు

ఐఓఎస్‌11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, ధర సుమారు 1000 డాలర్లు ఉంటుందని అంచనా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 8 launch confirmed for September 12: Apple sends out event invites Read more At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting