ఐఫోన్ 8 ఈ రేంజ్‌లో వస్తోందా..?

ఐఫోన్ 8 ఫీచర్లపై ఇప్పటికే కొన్ని వెబ్‌సైట్లలో వాటి గురించిన లీక్‌డ్ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

By Hazarath
|

ఆపిల్ నుంచి త్వరలో రానున్న ఐఫోన్ 8 ఫీచర్లపై ఇప్పటికే కొన్ని వెబ్‌సైట్లలో వాటి గురించిన లీక్‌డ్ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే తాజాగా తైవాన్‌కు చెందిన కేజీఐ అనలిస్ట్ గ్రూప్ మింగ్ చి-కువో త్వరలో రానున్న కొత్త ఐఫోన్ మోడల్స్‌లో ఏమేం టాప్ ఫీచర్లు ఉండవచ్చో అంచనా వేసి చెబుతున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను బయటకు అందించింది.

అన్నదమ్ముల మధ్య జియో చిచ్చు, అసలేమైంది..?అన్నదమ్ముల మధ్య జియో చిచ్చు, అసలేమైంది..?

బెజెల్ లెస్ డిస్‌ప్లేలు

బెజెల్ లెస్ డిస్‌ప్లేలు

శాంసంగ్ ఇటీవలే విడుదల చేసిన గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ఫోన్లలో ఉన్న డిస్‌ప్లేల తరహాలోనే ఆపిల్ కూడా తన కొత్త ఐఫోన్ మోడల్స్‌లో బెజెల్ లెస్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేస్తున్నట్టు మింగ్ చి-కువో గ్రూప్ వెల్లడించింది. దీంతో ఫోన్ డిస్‌ప్లే బాడీ కన్నా గరిష్ట భాగాన్ని ఆక్రమిస్తుంది. డిస్‌ప్లే సైజ్‌లు 4.7, 5.2, 5.5, 5.8 లలో కొత్త ఐఫోన్ మోడల్స్ రావచ్చని తెలిపింది.

ఎంబెడ్డెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఎంబెడ్డెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్

ఇప్పటి వరకు వచ్చిన పలు ఐఫోన్ మోడల్స్‌లో టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ను హోమ్ బటన్ కిందే అమర్చారు. అయితే ఇకపై రానున్న ఐఫోన్‌లలో డిస్‌ప్లే కిందే ఎంబెడ్డెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చవచ్చని తెలిసింది.

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ

ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ

కళ్లతోనే ఫోన్ అన్‌లాక్ చేయడం, కళ్ల గెస్చర్స్‌తో అప్లికేషన్లను ఓపెన్, క్లోజ్ చేయడం వంటి పనులు చేసుకునే విధంగా నూతన ఐఫోన్‌లలో కొత్తగా 3డీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఆపిల్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.

ఐఫోన్ 32 జీబీకి సెలవు

ఐఫోన్ 32 జీబీకి సెలవు

కొత్తగా రానున్న ఐఫోన్ మోడల్స్ ఇక 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌లలో విడుదల కావు. కేవలం 64, 128, 256 జీబీ మోడల్స్‌లోనే కొత్త ఐఫోన్లు వచ్చేందుకు అవకాశం ఉందట.

యూఎస్‌బీ టైప్ సి

యూఎస్‌బీ టైప్ సి

ఇప్పటికే చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో యూఎస్‌బీ టైప్ సి పోర్టును అందిస్తున్నారు. దీంతో చార్జింగ్ వేగంగా అవడమే కాదు, డేటా కూడా వేగంగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ క్రమంలోనే కొత్తగా రానున్న ఐఫోన్స్‌లో యూఎస్‌బీ టైప్ సి పోర్టును అందించనున్నట్టు మింగ్ చి-కువో గ్రూప్ వెల్లడించింది.

Best Mobiles in India

English summary
Apple iPhone 8 may not feature Touch ID at all: KGI analyst Ming-Chi Kuo Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X