Home
Mobile

ఐఫోన్‌పై మీరు ఉహించనంత డిస్కౌంట్‌.. A19 ప్రో చిప్‌, సూపర్‌ రెటీనా డిస్‌ప్లే సహా సూపర్‌ ఫీచర్లు..!

Apple iPhone Air : ఆపిల్ గత సంవత్సరం ఐఫోన్ ఎయిర్‌ మోడల్‌ ను తీసుకొచ్చింది. ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా ఈ హ్యాండ్‌సెట్‌ను తీసుకొచ్చింది. సన్నని డిజైన్‌ను కలిగి ఉంది. గెలాక్సీ S25 ఎడ్జ్‌ మోడల్‌కు పోటీగా ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఐఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు.

రూ.28 వేలకు పైగా డిస్కౌంట్ :
అమెజాన్‌ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్‌ లీగ్ 2026 లో (Amazon Electronics Premier League Sale) భాగంగా ఐఫోన్ ఎయిర్‌ మోడల్‌ను సుమారు రూ.28 వేలకు పైగా డిస్కౌంట్‌ను పొందవచ్చు. భారత్‌ మార్కెట్లో ఈ ఫోన్‌ గత నెల సెప్టెంబర్‌ నెలలోనే అందుబాటులోకి వచ్చింది. అంతలోనే డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉంది.

Amazon Electronics Premier League Sale 2026

రూ.26 వేల డిస్కౌంట్‌తోపాటు :
విడుదల సమయంలో ఆపిల్ ఎయిర్ 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.119900, 512GB స్టోరేజీ ధర రూ.139900. 1TB వేరియంట్‌ రూ.159900 గా ఉండేది. అమెజాన్ ప్రత్యేక సేల్‌లో భాగంగా 256GB స్టోరేజీ వేరియంట్‌ రూ.93499 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.26401 డిస్కౌంట్‌ను పొందవచ్చు.

దీంతోపాటు రూ.2000 కూపన్‌ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. అంటే మొత్తంగా రూ.28401 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అదే 512GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.1,13,990 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.25901 తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు 512GB వేరియంట్‌పై రూ.5000 కూపన్‌ కోడ్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. మొత్తంగా రూ.30 వేలకు పైగా తగ్గింపును అందిస్తోంది.

Amazon Electronics Premier League Sale 2026

రూ.32 వేల డిస్కౌంట్ :
1TB స్టోరేజీ వేరియంట్‌ ను రూ.132990 కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.26910 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు రూ.6000 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. మొత్తంగా రూ.32910 డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డులపైనా డిస్కౌంట్‌ను అందిస్తోంది.

ఆపిల్‌ సన్నని ఫోన్‌ :
ఐఫోన్‌ ఎయిర్‌ మోడల్‌ 5.6mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. 80 శాతం రిసైకిల్డ్‌ టైటానియం మెటీరియల్స్‌తోనే తయారు చేసినట్లు ఆపిల్‌ తెలిపింది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 3000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌తో 6.5 అంగుళాల సూపర్‌ రెటీనా XDR ప్రోమోషన్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ సిరామిక్‌ షీల్డ్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

48MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు సెన్సర్‌ షిఫ్ట్‌ ఆప్టికల్ ఇమేజ్‌ స్టెబిలైజేషన్, 2x టెలిఫోటో జూమ్‌తో 48MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 18MP కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి రోజంతా వినియోగించుకోవచ్చని ఆపిల్ చెబుతోంది.

A19 ప్రో చిప్‌ :
ఐఫోన్ ఎయిర్‌ A19 ప్రో చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. iOS 26 పైన పనిచేస్తోంది. N1 చిప్‌, C1x మోడెమ్‌ కూడా ఉన్నాయి. అనేక ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంది. క్లౌడ్‌ వైట్‌, స్పేస్‌ బ్లాక్‌, లైట్‌ గోల్డ్, స్కై బ్లూ కలర్‌ వేరియంట్స్‌లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPhone air gets massive discount on Amazon Electronics Premier League Sale 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X