2జీబి, 3జీబి ర్యామ్ వేరియంట్‌లలో iPhone SE 2, భారత్‌లోనే లభ్యం!

|

ఐఫోన్ ఎస్ఈ పేరుతో స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ సిరీస్‌ను కుపెర్టినో టెక్ దిగ్గజం యాపిల్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. 2016 మార్చి 21వ తేదీన యాపిల్ తన మొట్టమొదటి ఎస్ఈ మోడల్‌ను ప్రవేశపెట్టగా మార్చి 31, 2016 నుంచి ఆ డివైస్ మార్కెట్లో లభ్యమవుతోంది.ఐఫోన్ 5ఎస్‌కు సక్సెసర్ వర్షన్‌గా మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ ఎస్ఈ మోడల్‌కు ఇప్పుడో మరో సక్సెసర్ వర్షన్ రాబోతోంది. ఐఫోన్ ఎస్ఈ 2 పేరుతో విడదల కాబోతోన్న ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతుందట. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఫోన్‌ను అభివృద్ధి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ డివైస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యాపిల్ రివీల్ చేసే అవకాశముంది.

 

ఈ టిప్స్‌తో మీ గాడ్జెట్‌లకు మినిమమ్ సెక్యూరిటీ గ్యారంటీ..ఈ టిప్స్‌తో మీ గాడ్జెట్‌లకు మినిమమ్ సెక్యూరిటీ గ్యారంటీ..

 రెండు వేరియంట్‌లలో లభ్యం..

రెండు వేరియంట్‌లలో లభ్యం..

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ ఎస్ఈ 2 రెండు స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ తోనూ, రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్‌తో లభ్యమయ్యే అవకాశముందని తెలుస్తోంది. 4.5 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేలతో డిజైన్ కాబడుతోన్న ఈ ఫోన్‌లలో డ్యుయల్ కోర్ ప్రాసెసర్లను నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.

 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్..

12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్..

ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి 12 మెగా పిక్సల్ రేర్ అలానే 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశముంది. 2100 ఎమ్ఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీతో ఈ ఫోన్ అందుబాటలో ఉంటుంది.

భారత్‌లోనే తయారీ...
 

భారత్‌లోనే తయారీ...

యాపిల్ తన ఐఫోన్ ఎస్ఈ డివైస్‌లను బెంగుళూరుకు చెందిన విస్ట్రన్ అనే కాంట్రాక్ట్ మాన్యూఫ్యాక్షురర్ ద్వారా యాపిల్ ఈ ఫోన్‌లను తయారు చేయిస్తోంది. ఇటీవల ఇంపోర్టెడ్ మొబైల్స్ పై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంఖాన్ని 20 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐఫోన్ ధరలు కొండెక్కిన విషయం తెలిసిందే. లేటస్ట్‌గా లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్‌తో పాటు మిగిలిన ఐఫోన్ మోడల్స్ రేట్లను యాపిల్ ఒక్కసారిగా పెంచేసింది. ఐఫోన్ ఎస్ఈ మోడల్‌ భారత్‌లోనే తయారవుతుండటంతో ఈ ఫోన్ పై ఎటువంటి ధర పెంపును యాపిల్ అనౌన్స్ చేయలేదు.

రూ.26,000 పైనే...

రూ.26,000 పైనే...

మార్కెట్లో 32జీబి మోడల్ ఐఫోన్ ఎస్ఈ ధర రూ.26,000గాను, 128జీబి మోడల్ ధర రూ.35,000గాను ఉంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,499 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

Best Mobiles in India

English summary
Apple, the Cupertino tech giant has designed and manufactured the iPhone SE (Special Edition) as a part of its iPhone series of devices. The iPhone SE series was unveiled back on March 21, 2016, and was publically made available on March 31, 2016, at the company's headquarters.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X