Just In
Don't Miss
- Finance
కార్వీ కేసు: బ్యాంకులకు ఊరట అప్పీలును తిరస్కరించిన ‘శాట్’
- News
దిశ నిందితులకు శిక్ష.. మరి మానస నిందితుల పరిస్థితి, ఒక్కరు కాదు నలుగురు, పేరెంట్స్
- Movies
అలాంటి కామెంట్లు పెట్టారో అంతే సంగతి.. వారికి థ్యాంక్స్ చెప్పిన అనసూయ, చిన్మయి
- Sports
ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: టీమిండియా విజయ లక్ష్యం 208
- Lifestyle
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఆపిల్ నుంచి ఐఫోన్ ఎస్ఈ2 , అచ్చం Iphone X లాగే..
సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ ఆపిల్ ఐఫోన్ ఎస్ఈని 2016లో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఫోన్‌కు మరో వెర్షన్‌ను ఆపిల్ విడుదల చేయలేదు. కానీ త్వరలోనే ఐఫోన్ ఎస్ఈ 2 ను విడుదల చేయవచ్చని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోన్ అచ్చం ఐఫోన్ X తరహాలో ఉంటుందని సమాచారం. ఐఫోన్ Xలో ఉన్నట్లుగానే ఐఫోన్ ఎస్ఈ 2లో డిస్ప్లే పై భాగంలో నాచ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా దీనికి సంబంధించిన ఇమేజ్‌లు ప్రస్తుతం ఆన్లైన్లో లీకయ్యాయి. ఇక ఈ ఫోన్‌ను త్వరలో జరగనున్న ఆపిల్ డెవలపర్ సదస్సులో విడుదల చేయనున్నట్లు తెలిసింది.
ఈ ఫోన్లో ఐఫోన్ ఎస్ఈలో లాగే 4 ఇంచుల తెరను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఐఫోన్ X లో ఉన్నట్లుగా ఫేస్ ఐడీ ఫీచర్‌ను ఐఫోన్ ఎస్ఈ 2లో అందివ్వనున్నట్లు తెలిసింది. అయితే ఈ ఫోన్ గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.
కాగా 2016లో విడుదలయిన ఐఫోన్ ఎస్ఈ ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే..
ఐఫోన్ ఎస్ఈ ఫీచర్లు
4 ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 640 x 1136 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.84 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ యాపిల్ ఎ9 ప్రాసెసర్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ పవర్ వీఆర్ జీటీ7600 సిక్స్కోర్ గ్రాఫిక్స్ 2 జీబీ ర్యామ్ 16/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఐఓఎస్ 9.3, సింగిల్ నానో సిమ్ ఎన్ఎఫ్సీ, 4జీ 4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్, బ్లూటూత్ 4.2 యాపిల్ పే, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ 1642 ఎంఏహెచ్ బ్యాటరీ.
ఐఫోన్ ఎస్ఈ 2పై గురిపెట్టిన ఆపిల్, అంతా సీక్రెట్ !
ఇదిలా ఉంటే ఐఫోన్ ఎస్ఈ2 బెంగుళూరులో తయారయ్యే అవకాశం ఉందని ఇంతకుముందు కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ కంపెనీకి చెందిన స్వంత ఏ10 ఫ్యూజన్ చిప్సెట్తో రూపొందుతుందని, రెండు స్టోరేజ్ ఆప్షన్లు 32జీబీ, 128జీబీ వేరియంట్లలో ఇది లభ్యం కాబోతుందని తైవాన్ ఎకనామిక్ డైలీ న్యూస్ రిపోర్టు చేసింది. అయితే దీనిపై ఆపిల్ ఇప్పటిదాకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,200
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090