ఆపిల్ ఇంటెలిజెన్స్, OLED డిస్‌ప్లేతో ఐఫోన్ SE మోడల్.. ఎప్పుడు విడుదల కానుందంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ నుంచి ఐఫోన్ SE సిరీస్ హ్యాండ్‌సెట్ (Upcoming iPhone SE) త్వరలో విడుదల కానుంది. ఇతర ఐఫోన్‌ల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు గత మోడళ్ల కంటే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ విడుదలపై కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ OLED డిస్‌ప్లే మరియు ఆపిల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.
బ్లూమ్‌బర్గ్ మార్క్ గుర్మన్ నివేదిక ప్రకారం ఐఫోన్ SE స్మార్ట్‌ఫోన్ 2025 సంవత్సరం తొలి మూడు నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ SE 3 మోడల్ 2022 మార్చి నెలలో విడుదల అయింది. అయితే ఈ కొత్త ఐఫోన్ SE మోడల్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐఫోన్ 14 ను పోలి ఉంటుందని తెలుస్తోంది. మరియు ప్రస్తుతం SE మోడల్ స్మార్ట్‌ఫోన్ కంటే ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.

ఈ ఆపిల్ ఐఫోన్ SE తక్కువ ధరలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు చేస్తుంది. గతంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ A17 ప్రో చిప్‌సెట్ సహా తర్వాత తరం చిప్‌సెట్‌లలోనే అందుబాటులో ఉండేది.
సాధారణంగా ఈ తరహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను ఐఫోన్ స్టాండర్డ్ మోడళ్లలోనే ఉంటాయి. అదే తరహా ఫీచర్‌లను ఇప్పుడు ఐఫోన్ SE స్మార్ట్‌ఫోన్‌లో కూడా పొందవచ్చని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. త్వరలో ఐఫోన్ 16 సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు యాక్షన్ బటన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఐఫోన్ SE స్మార్ట్‌ఫోన్ గత మోడల్ కంటే అనేక అప్‌గ్రేడ్‌లతో రానుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ ధర $500 కే (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.42,000) అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో అధునాతన డిజైన్ సహా OLED డిస్‌ప్లే మరియు శక్తివంతమైన చిప్‌సెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్‌తో విడుదల కానుందని తెలుస్తోంది.
సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు విడుదల కానున్నాయి. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ హ్యాండ్‌సెట్లు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ రెండో వారంలో విడుదల కానున్నాయి. గత మోడల్‌తో పోలిస్తే అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
ఇటీవలే ఈ సిరీస్ కలర్ వేరియంట్ వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 16 మోడల్ వైట్, బ్లూ, బ్లాక్, పింక్, గ్రీన్ వంటి 5 రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రో మోడల్ గ్రే, బ్లూ టైటానియం లేదా రోజ్ రంగుల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రో మోడల్ గ్లోసీ ఫినిష్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
వీటితోపాటు ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ల గురించి కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ గత మోడల్ కంటే పెద్ద, బ్రైట్‌నెస్ కలిగిన డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో డిస్‌ప్లే 6.1 అంగుళాలు ఉండగా.. ఐఫోన్ 16 ప్రో డిస్‌ప్లే మాత్రం 6.3 అంగుళాలుగా ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications







