Just In
- 33 min ago
Amazon App ఉందా..?అయితే ఈ రూ.20000 మీరే గెలుచుకోవచ్చు.
- 17 hrs ago
OPPO Reno5 Pro 5G: 2021 లో బెస్ట్ వీడియోగ్రఫీ స్మార్ట్‌ఫోన్ ఇదే !
- 20 hrs ago
Vivo స్మార్ట్ఫోన్ల కొనుగోలుకు సరైన సమయం!! అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ సేల్ లో అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ..
- 22 hrs ago
Flipkart quiz: బిగ్ సేవింగ్ డేస్ సేల్ కోసం డిస్కౌంట్ వోచర్లను పొందే గొప్ప అవకాశం
Don't Miss
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Movies
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
iPhone X పై రూ.12,000 క్యాష్‌బ్యాక్, త్వరపడండి
యాపిల్ స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐఫోన్ ఎక్స్ (iPhone X) పై పేటీఎమ్ మాల్ ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్‌లను అనౌన్స్ చేసింది. తాజాగా లాంచ్ చేసిన కొత్త ఆఫర్స్‌లో భాగంగా ఐఫోన్ ఎక్స్ 64జీబి వేరియంట్‌ను రూ.77,888కే సొంతం చేసుకునే అవకాశాన్ని పేటీఎమ్ కల్పిస్తోంది.Bఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు ఈఎమ్ఐ లావాదేవీల పై అదనంగా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తున్నట్లు పేటీఎమ్ తెలిపింది.

64జీబి వేరియంట్స్ పై..
ప్రస్తుతం పేటీఎమ్ మాల్‌లో ఐఫోన్ ఎక్స్ 64జీబి (స్పేస్ గ్రే కలర్ వేరియంట్) రూ.89,888 ధర ట్యాగ్‌తో లిస్ట్ అయి ఉంది. తాజా ఆఫర్‌లో భాగంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్ పోనూ రూ.77,888కే ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక ఐఫోన్ ఎక్స్ 64జీబి (సిల్వర్ కలర్ వేరియంట్) రూ.92,690 ధర ట్యాగ్‌తో లిస్ట్ అయి ఉంది. తాజా ఆఫర్‌లో భాగంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్ పోనూ రూ.80,690కే ఈ డివైస్ లభ్యమవుతోంది.

256జీబి వేరియంట్స్ పై..
ఐఫోన్ ఎక్స్ 256జీబి (స్పేస్ గ్రే కలర్ వేరియంట్) రూ.1,00,049 ధర ట్యాగ్‌తో పేటీఎమ్ మాల్‌లో లిస్ట్ అయి ఉంది. తాజా ఆఫర్‌లో భాగంగా రూ.12,000 క్యాష్‌బ్యాక్ పోనూ రూ.88,049కే ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ ఎక్స్ 256జీబి (సిల్వర్ కలర్ వేరియంట్) విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ రూ.1,04,999 ధర ట్యాగ్‌తో పేటీఎమ్ మాల్‌లో లిస్ట్ అయి ఉంది. రూ.12,000 క్యాష్‌బ్యాక్ పోనూ రూ.92,999కే ఈ డివైస్‌ను సొంతం చేసుకోవచ్చు.

ముందుగా ఐఫోన్ 10..
యాపిల్ ఐఫోన్ మార్కెట్లో లాంచ్ అయి 10 సంవత్సరాల పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ సంస్థ iPhone X పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను ఫోన్‌ను గతేడాది మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 10గా పిలవబడుతోన్న ఈ ఫోన్‌కు సంబంధించి 5 ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

బీజిల్ లెస్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్‌ప్లే..
డిజైనింగ్ పరంగా ఇప్పటి వరకు మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్‌లతో పోలిస్తే, iPhone Xను పూర్తిగా రీడిజైన్ చేయటం జరిగింది. bezel-less edge-to-edge డిస్‌ప్లే, ఐఫోన్ ఎక్స్ ఫోన్‌కు ప్రధాన హైలైట్. ఈ మోడల్‌లో హోమ్ బటన్ కనిపించదు. స్టెయిన్‌లెస్ స్టీల్ బ్యాండ్స్ ఫోన్ లుక్‌నే మార్చివేసాయి. గ్లాస్ బాడీ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చింది.

ఓఎల్ఈడి స్క్రీన్ ..
iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ OLED స్క్రీన్ . అంతేకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఏకంగా 5.8 అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉంది. డిస్‌ప్లే రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 2436 x 1125పిక్సల్స్ విత్ 458 పీపీఐ.

ఫేస్ ఐడి..
iPhone X స్మార్ట్‌ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ FaceID. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్ లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.

యానీమోజీస్..
యాపిల్ తన iPhone X స్మార్ట్‌ఫోన్ ద్వారా సరికొత్త animated emojisను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిని Animojisగా యాపిల్ అభివర్ణిస్తోంది. ఈ యానిమోజిస్ అనేవి యూజర్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆధారంగా సృష్టించబడతాయి. ఇందుకు అవసరమైన కస్టమ్ 3డీ వర్షన్స్‌ను FaceID ఫీచర్ సమకూరుస్తుంది.

వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్..
iPhone X స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇందుకుగాను Qi అనే స్టాండర్డ్ టెక్నాలజీని ఉపయోగించకుంటుంది. iPhone X స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసేందుకు AirPower పేరుతో ఓ మ్యాట్‌ను రూపొందిస్తున్నట్లు యాపిల్ అనౌన్స్ చేసింది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190