నిలిచిపోనున్న ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎస్ఈ, అభిమానుల్లో కలవరం !

|

అమెరికా టెక్ ఐకాన్ ఆపిల్ సంచలన నిర్ణయంతో అభిమానులకు షాక్ ఇవ్వబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. మరికొన్ని నెలల్లో తన మెగా హార్డ్‌వేర్‌ ఈవెంట్‌ను నిర్వహించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్లోనే ఆపిల్ కొత్తగా 3 ఐఫోన్లను లాంచ్‌ చేయబోతుందని, ఈ కొత్త ఐఫోన్లకు 2018లో భారీ ఎత్తున డిమాండ్‌ వచ్చే అవకాశాలున్నాయని కూడా టెక్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. అయితే వీటికి డిమాండ్‌ భారీ ఎత్తున్న ఉండబోతున్న తరుణంలో, ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేసిన ఐఫోన్‌ ఎక్స్‌ను, ఐఫోన్‌ ఎస్‌ఈ లను నిలిపివేస్తుందని టెక్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

 

రూ.35 వేలకే ఐఫోన్ X, ఆపిల్ వ్యూహం ఇదే !

తన దృష్టి అంతా..

తన దృష్టి అంతా..

ఆపిల్ కంపెనీ ఇప్పుడు తన దృష్టి అంతా కొత్తగా విడుదల చేయనున్న మూడు ఐఫోన్లపైనే సారించిందని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం గత కొన్నేళ్లుగా ఆపిల్ కంపెనీ ఎలాంటి అప్ గ్రేడ్ ఇవ్వడం లేదు.

తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ..

తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ..

బ్లూఫిన్‌ రీసెర్చ్‌ విడుదల చేసిన ఓ ఇన్వెస్టర్‌ నోట్‌లో.. గత కొన్నేళ్లుగా ఎలాంటి అప్‌గ్రేడ్‌ లేకపోవడంతో, తాజాగా తీసుకొచ్చే ఐఫోన్లకే ఎక్కువ డిమాండ్‌ ఉంటుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఐఫోన్‌ ఎక్స్‌ సక్ససర్‌,  ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌
 

ఐఫోన్‌ ఎక్స్‌ సక్ససర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌

ఆపిల్‌ ఆ మెగా ఈవెంట్‌లో 5.8 అంగుళాల ఐఫోన్‌ ఎక్స్‌ సక్ససర్‌, 6.5 అంగుళాల ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌ మోడల్‌, అఫార్డబుల్‌ 6.1 అంగుళాల ఎల్‌సీడీ ఐఫోన్‌ను లాంచ్‌ చేస్తుంది. అఫార్డబుల్‌ ఎల్‌సీడీ ఐఫోన్‌కు భారీ ఎత్తున్న డిమాండ్‌ వస్తుందని చాలా కాలం నుంచే విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

 9.1 కోట్ల యూనిట్ల ఐఫోన్లను..

9.1 కోట్ల యూనిట్ల ఐఫోన్లను..

2018 మూడు, నాలుగు క్వార్టర్లలో 9.1 కోట్ల యూనిట్ల ఐఫోన్లను తయారు చేస్తుందని బ్లూఫిన్‌ విశ్లేషకులు ఆ నోట్‌లో చెప్పారు.

2019 తొలి రెండు క్వార్టర్లలో ..

2019 తొలి రెండు క్వార్టర్లలో ..

మరో 9.2 కోట్ల యూనిట్లను 2019 తొలి రెండు క్వార్టర్లలో రూపొందిస్తుందని పేర్కొన్నారు. షిప్‌మెంట్లను కూడా భారీగానే చేపట్టనుందని తెలిపారు.

ధర అంచనా..

ధర అంచనా..

ఐఫోన్‌ ఎక్స్‌ ధర(999 డాలర్లు) మాదిరే ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌ ధర కూడా ఉండే అవకాశం ఉందని అదేమాదిరి మూడు ఐఫోన్లలో కెల్లా 6.1 అంగుళాల ఎల్‌సీడీ ఐఫోన్‌ ధరనే అత్యంత తక్కువగా ఉంచనుందని తెలుస్తోంది.

ఐఫోన్‌ ఎస్‌ఈని రీప్లేస్‌..

ఐఫోన్‌ ఎస్‌ఈని రీప్లేస్‌..

సోషల్ మీడియాలో వస్తున్న రూమర్ల ప్రకారం దీని ధర 600 డాలర్ల నుంచి 700 డాలర్ల మధ్యలో ఉండొచ్చని సమాచారం. ఇది ఐఫోన్‌ ఎస్‌ఈని రీప్లేస్‌ చేస్తుందని తెలుస్తోంది.

ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎస్‌ఈలను..

ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎస్‌ఈలను..

అయితే ఈ ఫోన్లను లాంచ్‌ చేయబోతున్న తరుణంలో, ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎస్‌ఈలను నిలిపివేయబోతున్నట్టు విశ్లేషకులంటున్నారు.

ఆపిల్‌ నిలిపివేస్తే..

ఆపిల్‌ నిలిపివేస్తే..

ఒకవేళ ఐఫోన్‌ ఎక్స్‌ను కనుక ఆపిల్‌ నిలిపివేస్తే, లాంచ్‌ అయిన ఏడాదిలో నిలిచిపోయిన ఫోన్‌ ఇదే అవుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Apple may discontinue iPhone X, iPhone SE soon as it expects high demand for 2018 iPhones More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X