ఆపిల్ నుంచి ఒకేసారి మూడు ఐఫోన్లు, భారీ డిస్‌ప్లే, బడ్జెట్ ధర..

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ 2018లో దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

By Hazarath
|

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ 2018లో దిగ్గజాలకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మూడు రకాల ఐఫోన్లను లాంచ్ చేసేందుకు కసరత్తు చేస్తోందని రిపోర్టులు బయటకు వస్తున్నాయి. ఆపిల్ కంపెనీ నుంచి విడుదలయ్యే ఉత్పత్తులపై సరియైన అంచనాలను విడుదల చేసే కేజీఐ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు మింగ్‌-చి కుయో ఈ విషయాన్ని వెల్లడించారు. కుయో తాజా రిపోర్టులో ఆపిల్‌ 2018లో ఐఫోన్‌ ఎక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌, తక్కువ ధరలో 6.1 అంగుళాల అతిపెద్ద డిస్‌ప్లేతో ఐఫోన్‌ ఎక్స్‌ను ప్రవేశపెట్టనుందని తెలిపారు.

జియో సునామి : రూ.49కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్, అయితే..జియో సునామి : రూ.49కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్, అయితే..

బడ్జెట్‌ ధరలో ఐఫోన్‌ ఎక్స్‌ను..

బడ్జెట్‌ ధరలో ఐఫోన్‌ ఎక్స్‌ను..

బడ్జెట్‌ ధరలో ఐఫోన్‌ ఎక్స్‌ను ఆపిల్ కంపెనీ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. గతేడాది మార్కెట్లో కనువిందు చేసిన ఐఫోన్ ఎక్స్‌ను ఈ సారి 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే తో మార్కెట్లోకి తీసుకురానుందని మింగ్‌-చి కుయో చెబుతున్నారు.

రూ. 40 వేల నుంచి రూ. 50 వేల మధ్యలో..

రూ. 40 వేల నుంచి రూ. 50 వేల మధ్యలో..

మాక్ రూమర్స్ ప్రకారం 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే కలిగిన iPhone X ధర యుఎస్ మార్కెట్లో 700 నుంచి 800 డాలర్ల మధ్యలో ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. మన కరెన్సీలో ఇది రూ. 40 వేల నుంచి రూ. 50 వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది.

ఎల్‌సీడీ ప్యానల్స్‌

ఎల్‌సీడీ ప్యానల్స్‌

కాగా ఇంతకు ముందు ఫోన్లలా ఇది OLED displayతో వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెర్షన్‌ కోసం జపాన్‌ డిస్‌ప్లే 70 శాతం ఎల్‌సీడీ ప్యానల్స్‌ను సరఫరా చేస్తుందని కేజీఐ సెక్యురిటీస్‌ విశ్లేషకుడు మింగ్‌-చి కుయో చెబుతున్నారు.

 పెద్ద బ్యాటరీ..

పెద్ద బ్యాటరీ..

ఆల్ట్రా స్లిమ్‌ బెజెల్స్‌లో రూపొందుతున్న ఈ ఫోన్‌కు, ఫేస్‌ ఐడీ, యానిమోజీస్‌ ఉంటాయని తాజా రిపోర్టు పేర్కొంది. 2017 ఐఫోన్‌ ఎక్స్‌ కంటే కూడా పెద్ద బ్యాటరీని ఇది కలిగి ఉంటుందట. అల్యూమినియం ఫ్రేమ్‌, నో 3డీ టచ్‌, సింగిల్‌ రియర్‌ కెమెరా దీనిలో మిగతా ఫీచర్లు.

అచ్చం ఐఫోన్‌ ఎస్‌ఈ2 మాదిరిగా..

అచ్చం ఐఫోన్‌ ఎస్‌ఈ2 మాదిరిగా..

మరికొన్ని అంచనాల ప్రకారం ఈ ఐఫోన్‌ ఎక్స్‌, అచ్చం ఐఫోన్‌ ఎస్‌ఈ2 మాదిరిగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో ఐఫోన్ ఎస్‌ఈ 2 కూడా మార్కెట్‌లోకి వస్తున్నట్టు డిజిటైమ్స్‌ రిపోర్టు సంకేతాలిచ్చింది.

మిగతా రెండు ఐఫోన్లు..

మిగతా రెండు ఐఫోన్లు..

2018లో రాబోతున్న మిగతా రెండు ఐఫోన్లు ఐఫోన్‌ ఎక్స్‌(2018), ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌లు 6.5 అంగుళాల, 5.8 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నట్టు కూడా కుయో రిపోర్టు చేశారు. ఐఫోన్‌ ఎక్స్‌ ప్లస్‌కు 4జీబీ ర్యామ్‌, అతిపెద్ద 3300-3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండనున్నాయి.

Best Mobiles in India

English summary
Apple iPhone X, iPhone X Plus and 6.1-inch iPhone X to launch in 2018: Ming Chi-Kuo more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X