రూ. 89 వేల ఫోన్ సైతం out of stock, దుమ్మురేపిన ఆపిల్
ఆపిల్ ఫోన్లకు ఇండియాలో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువైంది. ఐఫోన్ ఎక్స్ రిలీజ్ కాకముందే ఫ్రీ ఆర్డర్లు దుమ్మురేపాయి.
ఆపిల్ ఫోన్లకు ఇండియాలో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువైంది. ఐఫోన్ ఎక్స్ రిలీజ్ కాకముందే ఫ్రీ ఆర్డర్లు దుమ్మురేపాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మధ్యాహ్నాం 12.30 నిమిషాలకు ఐఫోన్ ఆర్డర్లు స్టార్ట్ అయితే కేవలం గంటలోపే అన్ని ఫోన్లు బుక్ అయిపోయాయి. భారత్‌తో పాటు మొత్తం 55 దేశాల్లో ఈ ప్రీ బుకింగ్ ఆర్డర్స్ మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సైట్లలో ఈ ఫోన్ బుక్ చేద్దామనకున్న వారికి అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది.

ట్యాబ్ కు మీ ఈమెయిల్ సెట్
ఈ ఫోన్ కావాలనుకున్నవారు అక్కడ కనిపించే నోటిఫై ట్యాబ్ కు మీ ఈమెయిల్ సెట్ చేసుకోవాలి. మళ్లీ ఆర్డర్స్ మొదలైనప్పుడు.. అలా సెట్ చేసుకున్న వాళ్లకు ఆ ట్యాబ్ ద్వారా సమాచారం అందుతుంది.

రెండు వేరియంట్లలో
మొత్తం రెండు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమవుతోంది. సిల్వర్‌తో పాటు స్పేస్ గ్రే కలర్స్ లో ఈ ఫోన్ రిలీజ్ చేస్తున్నారు. కాగా నవంబర్ 3 నుంచి ఐఫోన్ టెన్ మార్కెట్లోకి వస్తోంది.

సిటిబ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు..
ఐఫోన్ ఎక్స్‌పై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ బంపర్ ఆఫర్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఐఫోన్ ఎక్స్‌ను కొనుగోలు చేసే సిటిబ్యాంకు క్రెడిట్ కార్డు హోల్డర్స్‌కు రూ.10వేల క్యాష్‌బ్యాక్ ఈ వెబ్‌సైట్లు అందిస్తున్నాయి.

అమెజాన్ 70 శాతం బైబ్యాక్ గ్యారెంటీని..
అంతేకాక రిలయన్స్ జియో భాగస్వామ్యంలో అమెజాన్ 70 శాతం బైబ్యాక్ గ్యారెంటీని ఆఫర్ చేస్తోంది. ఈ బైబ్యాక్ గ్యారెంటీ పొందాలంటే, వినియోగదారుడు రూ.799తో జియో కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ 2017 నవంబర్ 3 నుంచి 2017 డిసెంబర్ 31 వరకు వాలిడ్‌లో ఉంటుంది.

ఐఫోన్ X ఫీచర్లు
5.8 ఇంచ్ ఓలెడ్ సూపర్ రెటీనా టచ్ స్క్రీన్ డిస్‌ప్లే
2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆపిల్ ఎ11 బయానిక్ చిప్‌సెట్
3జిబి ర్యామ్, 64/256 ఇంటర్నల్ స్టోరేజి, విస్తరణ సామర్ధ్యం లేదు
12 ఎంపీ ప్రైమరీ రేర్ డ్యూయెల్ కెమెరా, 7 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ సిమ్ సపోర్ట్
2716mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ, బరువు 174 గ్రాములు
డాల్బీ విజన్, ఫేస్ ఐడీ, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ,
ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్


Click it and Unblock the Notifications








