Apple ఈవెంట్ ముఖ్యాంశాలు

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 8 64జీబి వేరియంట్ ధర రూ.64,000గా ఉంటుంది. 256జీబి వేరియంట్ దర రూ.77,000గా ఉంటుంది. ఐఫోన్ 8 ప్లస్ 64జీబి వేరియంట్ దర రూ.73,000గానూ, 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86,000.

|

యాపిల్ 2017 కీనోట్ ఈవెంట్‌లో భాగంగా యాపిల్ తన కొత్త ఐఫోన్‌లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 3, యాపిల్ టీవీ 4కే ఇంకా కొత్త ఆపరేటింగ్ సిస్టంను మార్కెట్లో అనౌన్స్ చేసింది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 లాంచ్ అయ్యింది, ధర రూ.67,900సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 లాంచ్ అయ్యింది, ధర రూ.67,900

యాపిల్ వాచ్ సిరీస్ 3

యాపిల్ వాచ్ సిరీస్ 3

యాపిల్ తన కీనోట్ ఈవెంట్‌ను యాపిల్ వాచ్ సిరీస్ 3 అనౌన్స్‌మెంట్‌తో ప్రారంభించింది. యాపిల్ వాచ్ సిరీస్ 3కి బిల్ట్-ఇన్ LTE కనెక్టువిటీ సపోర్ట్ ప్రధాన హైలైట్ గా నిలుస్తుంది. స్టాండర్డ్ వై-ఫై, బ్లుటూత్ వంటి కనెక్టువిటీ ఆప్షన్స్ కూడా ఈ వాచ్ లో ఉంటాయి. LTE కనెక్టువిటీ సపోర్ట్ ద్వారా కాల్స్ నేరు వాచ్ నుంచే డయల్ లేదా రిసీవ్ చేసుకోవచ్చు. ఇదే సమయంలో యాపిల్ మ్యూజిక్ నుంచి పాటలను ప్లే చేసుకునే వీలుంటుంది.

 రెండు వర్షన్స్‌లో..

రెండు వర్షన్స్‌లో..

డ్యుయల్ కోర్ ప్రాసెసర్ పై వాచ్ రన్ అవుతుంది. సిరి యాప్ సహాయంతో వాయిస్ కమాండ్స్  ఆధారంగా వాచ్ ను నియంత్రించుకోవచ్చు. రెండు వర్షన్స్‌లో ఈ వాచ్ అందుబాటులో ఉంటుంది. మొదటిది సెల్యులార్ వర్షన్‌తోనూ, రెండవది నాన్-సెల్యులార్ వర్షన్ తోనూ లభ్యమవుతుంది. సెల్యులార్ వేరియంట్ ధర 399 డాలర్లు, నాన్-సెల్యులార్ వేరియంట్ ధర 329 డాలర్లు. సెప్టంబర్ 15 నుంచి ప్రీ-ఆర్డర్స్ ప్రారంభమవుతాయి. ఇండియన్ మార్కెట్లో ఈ వాచ్ ప్రారంభ వేరియంట్ ధర రూ.29,900గా ఉంటుంది. సెప్టంబర్ 29 నుంచి సేల్ ప్రారంభమవుతుంది.

Apple TV 4K
 

Apple TV 4K

యాపిల్ తన కీనోట్ ఈవెంట్‌లో భాగంగా యాపిల్ వాచ్ సిరీస్ 3తో పాటు యాపిల్ టీవీ 4కేను కూడా విడుదల చేసింది. A10X Fusion chip పై రన్ అయ్యే ఈ టీవీ 3జీబి ర్యామ్ కెపాసిటీని కలిగి ఉంటుంది. 4కే క్వాలిటీ రిసల్యూషన్‌ను ఈ టీవీ ఆఫర్ చేస్తుంది. సెప్టంబర్ 22 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. 32జీబి వర్షన్ ధర 179 డాలర్లు, 128జీబి వర్షన్ ధర 199 డాలర్లు.

 Apple iPhone X

Apple iPhone X

ఐఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని iPhone X పేరు స్పెషల్ ఎడిషన్ ఫోన్‌ను యాపిల్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి.. 5.8 అంగుళాల సూపర్ రెటీనా డిస్‌ప్లే విత్ OLED ప్యానల్ (రిసల్యూషన్2436 x 1125పిక్సల్స్, 458 పీపీఐ), HDR10 డాల్బీ విజన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్ సెట్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, యాపిల్ 3డి టెక్నాలజీ, ట్రు టోన్ టెక్నాలజీ, ట్రూడెప్త్ కెమెరా సిస్టం, టచ్ ఐడీ, 12 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్. ఈ ఫోన్ కు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ ఆక్టోబర్ 27 నుంచి స్వీకరించబడతాయి. డెలివరీ ప్రక్రియ నవంబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. ధర రూ.89,000.

ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్

ఐఫోన్ 8 స్సెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్. ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 8 64జీబి వేరియంట్ ధర రూ.64,000గా ఉంటుంది. 256జీబి వేరియంట్ దర రూ.77,000గా ఉంటుంది.

 ఐఫోన్ 8 ప్లస్ స్సెసిఫికేషన్స్

ఐఫోన్ 8 ప్లస్ స్సెసిఫికేషన్స్

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్. ఐఫోన్ 8 ప్లస్ 64జీబి వేరియంట్ దర రూ.73,000గానూ, 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86,000గాను ఉంటుంది.

Best Mobiles in India

English summary
Apple iPhone X Priced at Rs. 89,000 for the Indian Market. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X