ఆపిల్ నుంచి ట్రిపుల్ కెమెరా ఐఫోన్, లీకేజ్‌తో దుమ్మురేపుతున్న iPhone X1

మొబైల్‌ దిగ్గ‌జం ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకునేందుకు కొత్త ఎత్తుగడలతో వస్తోంది.

|

మొబైల్‌ దిగ్గ‌జం ఆపిల్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో తన ప్రత్యేకతను చాటుకునేందుకు కొత్త ఎత్తుగడలతో వస్తోంది. సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ ఆపిల్ త‌న నూత‌న ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను అందివ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలోనే కొత్త ఐఫోన్ మోడ‌ల్‌కు చెందిన ఇమేజ్‌లు ప్ర‌స్తుతం నెట్‌లో లీక‌య్యాయి. ఇప్ప‌టికే త‌న ఫోన్ల‌లో డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా సెట‌ప్‌ను అందిస్తున్న ఆపిల్ ఇక‌పై రానున్న ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను అందివ్వ‌నున్న‌ట్లు సమాచారం.

జియో‌ఫోన్‌లో గేమ్స్ వస్తున్నాయ్, ఓ లుక్కేసుకోండిజియో‌ఫోన్‌లో గేమ్స్ వస్తున్నాయ్, ఓ లుక్కేసుకోండి

ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో

ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో

భవిష్యత్‌ ఐపోన్లను ట్రిపుల్‌ రియర్‌ కెమెరాలతో తీసుకురానుందని లీకయిన వివరాలను బట్టి తెలుస్తోంది. హువాయి తరహాలో త‌న నూత‌న ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను జోడించి కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది.

హువాయి మేట్‌ 20 ప్రొ బాటలో

హువాయి మేట్‌ 20 ప్రొ బాటలో

ఈ ఫోన్లకు సంబంధించిన కొత్త ఐఫోన్ 11 ఇమేజ్‌లు ప్ర‌స్తుతం నెట్‌లో లీక‌య్యాయి. హువాయి మేట్‌ 20 ప్రొ బాటలో ఆపిల్ తరువాతి తరం ఐఫోన్ల‌లో ట్రిపుల్ బ్యాక్ కెమెరాల‌ను అందివ్వ‌నున్న‌ట్లు సమాచారం.

3డీ ఇమేజ్‌ల‌కు స‌పోర్ట్‌

3డీ ఇమేజ్‌ల‌కు స‌పోర్ట్‌

ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌లో డ్యుయల్‌ కెమెరాలను జోడించిన సంస్థ ఇక ట్రిపుల్‌ కెమెరాలతో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను తీసుకురానుంది. అలాగే మూడో కెమెరా 3డీ ఇమేజ్‌ల‌కు స‌పోర్ట్‌ను ఇవ్వనుందట.

2019, సెప్టెంబరు నాటికి
 

2019, సెప్టెంబరు నాటికి

ప్ర‌స్తుతం ప‌లు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీలు 3డీ ఆప్ష‌న్‌ను కెమెరాల‌కు ఇస్తున్నాయి. అదే కోవ‌లో ఆపిల్ చేర‌నుంది. అలాగే కొత్త ఐఫోన్ల‌ను 2019, సెప్టెంబరు నాటికి అందివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా తాజా లీకులపై ఆపిల్‌ అధికారికంగా స్పందించాల్సి వుంది.

256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ లో

256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ లో

కొత్త ఐఫోన్ల‌ను కేవ‌లం 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ లో మాత్ర‌మే అందివ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. కాగా ఈ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాల్సిందే..!

Best Mobiles in India

English summary
Apple iPhone X1 with renders triple camera leaked: Inspired by Huawei? more News at GIzbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X