రూ.14,999 కడితే iPhone Xr మీ సొంతం...
యాపిల్ కొత్త్ ఐఫోన్‌లలో ఒకటైన ‘ఐఫోన్ ఎక్స్ఆర్’ (iPhone Xr) ఇప్పుడు ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ శుక్రవారం నుంచి అఫీషియల్‌గా ప్రారంభమయ్యాయి.
యాపిల్ కొత్త్ ఐఫోన్‌లలో ఒకటైన 'ఐఫోన్ ఎక్స్ఆర్’ (iPhone Xr) ఇప్పుడు ప్రీ-ఆర్డర్ పై లభ్యమవుతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ శుక్రవారం నుంచి అఫీషియల్‌గా ప్రారంభమయ్యాయి. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.76,900గా ఉంటుంది. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్స్, ఈ కొత్త ఐఫోన్ ఆర్డర్స్‌ను స్వీకరిస్తున్నాయి.

100జీబి డేటా, నెలంతా కాల్స్..
ఐఫోన్ ఎక్స్ఆర్‌కు సంబంధించి ఎయిర్‌టెల్ ఇప్పటికే ఓ ఆసక్తికర ప్రకటనను చేసింది. డౌన్‌పేమెంట్ క్రింద రూ.14,999 చెల్లించి తమ వద్ద ఐఫోన్ ఎక్స్ఆర్‌ను ప్రీ-ఆర్డర్ చేసినట్లయితే మిగిలిన మొత్తాన్ని ఈఎమ్ఐ రూపంలో చెల్లించవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈఎమ్ఐ ఫార్మాట్‌లో ఫోన్ కొనుగోలు చేసిన తేదీ నుంచి నెలకు 3,499 చొప్పున 24 నెలలు పాటు వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ చెల్లించే ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా 100జీబిల డేటాతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ యూజర్‌కు అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో రూ.1500 ఖరీదు చేసే నెట్‌ఫ్లిక్స్ మెంబర్‌షిప్‌తో పాటు అమెజాన్ ప్రైబ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది.

ఐఫోన్ ఎక్స్ఆర్ స్పెసిఫికేషన్స్..
6.1 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 1792 x 828 పిక్సల్ రిసల్యూషన్ అండ్ 326 పీపీఐ, 326 PPI, 625cd/m2 బ్రైట్నెస్, 1,400:1 కాంట్రాస్ట్ రేషియో (సూపర్ రెటీనా డిస్‌ప్లే), ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ12 బయోనిక్ చిప్‌సెట్ విత్ 64-బిట్ ఆర్కిటెక్షర్, ర్యామ్ కాన్ఫిగరేషన్ తెలియాల్సి ఉంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 64జీబి, 128జీబి ఇంకా 512జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.

కెమెరా స్పెక్స్..
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ f/1.8 అపెర్చుర్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ f/2.2 అపెర్చుర్ అండ్ ఫేస్ ఐడీ 3డీ ఫేషియల్ రికగ్నిషన్. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ ఎక్స్ తో పోలిస్తే ఐఫోన్ ఎక్స్ఆర్ 60 నుంచి 90 నిమిషాల అదనపు బ్యాటరీ బ్యాకప్ ను ఈ ఫోన్ ప్రొవైడ్ చేయగలుగుతుందట.

కనెక్టువిటీ ఫీచర్స్
కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, వై-ఫై 802.11a/b/g/n/ac, వై-ఫై విత్ MIMO, Gigabit ఎల్టీఈ, బ్లుటూత్ 5.0, లైట్నింగ్ పోర్ట్ వంటి విప్లవాత్మక ఫీచర్లను ఐఫోన్ ఎక్స్ కలిగి ఉంటుంది. క్యూఐ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తోన్న ఈ ఫోన్‌ను వైట్, బ్లాక్, బ్లూ, ఎల్లో ఇంకా రెడ్ కలర్ ఆప్షన్స్‌లో సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








