ఎయిర్‌టెల్‌, జియో స్టోర్స్‌లో ప్రారంభమైన iPhone ప్రీ-బుకింగ్స్..

భారీ అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ ఇంకా ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను సెప్టంబర్ 28 నుంచి ఇండియన్ మార్కెట్లో విక్రయించబోతోన్న విషయం తెలిసిందే.

|

భారీ అంచనాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఎస్ ఇంకా ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లను సెప్టంబర్ 28 నుంచి ఇండియన్ మార్కెట్లో విక్రయించబోతోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ ఫోన్‌లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్‌ను టెలికం దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్‌తో పాటు రిలయన్స్ జియోలు స్వీకరిస్తున్నాయి. ఈ కంపెనీలకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్‌సైట్‌లలో యాపిల్ కొత్త ఐఫోన్‌లను ప్రీ-బుక్ చేసకునే యూజర్లకు లాంచ్ ఆఫర్స్ క్రింద అనేక బెనిఫిట్స్ అందుబాటులో ఉంచారు.

ఐఫోన్ యూజర్లకి షాకిచ్చిన వాట్సప్, వాటికి పనిచేయదటఐఫోన్ యూజర్లకి షాకిచ్చిన వాట్సప్, వాటికి పనిచేయదట

64జీబి, 256జీబి, 512జీబి స్టోరేజ్ ఆప్షన్స్‌లలో లభ్యం..

64జీబి, 256జీబి, 512జీబి స్టోరేజ్ ఆప్షన్స్‌లలో లభ్యం..

మార్కెట్లో అందుబాటులో ఉండే రెండు ఐఫోన్ మోడల్స్ 64జీబి, 256జీబి ఇంకా 512జీబి స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో ఈ కొత్త ఐఫోన్ డ్యుయల్ సిమ్ కార్డ్ సపోర్టును కూడా ఆఫర్ చేస్తాయి. ఈ ఫోన్‌లలో ఒకటే ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఇంక్లూట్ చేసినప్పటికి, eSIM సౌకర్యం ద్వారా రెండవ సిమ్ కార్డ్ సపోర్ట్ లభిస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా యాపిల్ త్వరలో లాంచ్ చేయబోతోంది. ఎయిర్‌టెల్‌, రిలయన్స్ జియోల ద్వారా కొనుగోలు చేసే ఐఫోన్ మోడల్స్ పై ఈ eSIM కనెక్టువిటీ అనేది వర్తిస్తుంది.

 

 

ధరలు వివరాలు..

ధరలు వివరాలు..

ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ 64జీబి వేరియంట్ ధరను మార్కెట్లో రూ.1,09,900గా యాపిల్ నిర్ణయించింది. ఇదే సమయంలో 256జీబి మోడల్ ధరను రూ.1,24,900గాను, 256జీబి వేరియంట్ ధరను రూ.1,44,900గా కంపెనీ ఫిక్స్ చేసింది. ఇక ఐఫోన్ ఎక్స్ఎస్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్‌కు సంబంధించి 64జీబి వేరియంట్ ధరను రూ.99,900గా యాపిల్ నిర్ణయించింది. ఇదే సమయంలో 256జీబి వేరియంట్ ధరను రూ.1,14,900గానూ, 512జీబి వేరియంట్ ధరను రూ.1,34,900 గాను కంపెనీ ఫిక్స్ చేసింది.

 

 

ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొత్త ఐఫోన్ మోడల్స్‌ను..
 

ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొత్త ఐఫోన్ మోడల్స్‌ను..

ఎయిర్‌టెల్ ఆన్‌లైన్ స్టోర్‌లో కొత్త ఐఫోన్ మోడల్స్‌ను కొనుగోలు చేసే యూజర్లకు 5 శాతం క్యాష్ బ్యాక్‌తో పాటు 12 లేదా 24 నెలల EMI సౌకర్యాన్ని ఎయిర్‌టెల్ ప్రొవైడ్ చేస్తోంది. ఈ ప్రీ-ఆర్డర్స్ సెప్టంబర్ 27తో ముగుస్తాయి. ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్‌ను ఎయిర్‌టెల్‌, జియో వెబ్‌సైట్స్ ద్వారా ఏ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

ప్రీ-బుక్ చేసుకునేందకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ప్రీ-బుక్ చేసుకునేందకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్..

ముందుగా Jio.com లేదా www.airtel.in వెబ్‌సైట్‌లలోకి వెళ్లండి. ఆయా కంపెనీలకు సంబంధించిన సైట్‌లలో‌కి వెళ్లిన తరువాత మీరు కొనుగోలు చేయాలనుకుంటోన్న ఐఫోన్ మోడల్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఉండే ఏరియాకు సంబంధించిన పిన్‌కోడ్‌ను ఎంటర్ చేసి చెక్‌అవుట్ చేసేందకు ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే మెనూలో మీ పేరు, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ ఇంకా మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి పేమోంట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన వెంటనే మీ ప్రీ-ఆర్డర్ కు సంబంధించిన కన్ఫర్మేషన్ ఈ-మెయిల్ ఇంకా ఎస్ఎంఎస్ రూపంలో మీకు అందుతుంది.

ఐఫోన్ ఎక్స్ఎస్ స్పెసిఫికేషన్స్..

ఐఫోన్ ఎక్స్ఎస్ స్పెసిఫికేషన్స్..

5.8 అంగుళాల ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 2436 x 1125 పిక్సల్స్, 458 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టం, 7ఎన్ఎమ్ ప్రాసెస్ పై డిజైన్ చేయబడిన యాపిల్ ఏ12 బయోనిక్ చిప్‌సెట్ పై ఐఫోన్ ఎక్స్ రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 64జీబి, 128జీబి ఇంకా 512జీబి స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ర్యామ్ కాన్ఫిగరేషన్ తెలియాల్సి ఉంది. కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌లో 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను యాపిల్ నిక్షిప్తం చేసింది. 2,942 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ స్పెసిఫికేషన్స్..

ఐఫోన్ ఎక్స్ఎస్ మాక్స్ స్పెసిఫికేషన్స్..

6.5 అంగుళాల ఓఎల్ఈడి ట్రూ టోన్ డిస్‌ప్లే విత్ 2688 x 1242 పిక్సల్ రిసల్యూషన్ అండ్548 పీపీఐ, ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టం, 7ఎన్ఎమ్ ప్రాసెస్ పై డిజైన్ చేయబడిన యాపిల్ ఏ12 బయోనిక్ చిప్‌సెట్ పై ఐఫోన్ ఎక్స్ రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 64జీబి, 128జీబి ఇంకా 512జీబి స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ర్యామ్ కాన్ఫిగరేషన్ తెలియాల్సి ఉంది. కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌లో 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను యాపిల్ నిక్షిప్తం చేసింది. 3,174 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Apple iPhone XS, XS Max pre-orders begin in India: Here's how to book a new iPhone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X