ఇండియాకి ఐఫోన్ 8, 8ప్లస్ రెడ్ కలర్ వేరియంట్స్

Posted By: ChaitanyaKumar ARK

గత సంవత్సరం, క్యూపర్టినో( ఆపిల్ హెడ్ క్వార్టర్స్ ఉండే ప్రదేశం) సాంకేతిక దిగ్గజం ఆపిల్ ఐఫోన్-7 మరియు ఐఫోన్-7 ప్లస్ మోడల్స్ లో రెడ్ కలర్ వేరియంట్స్ ను ప్రవేశపెట్టింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ప్రపంచాన్నే వణికిస్తున్న మహమ్మారి ఎయిడ్స్ నియంత్రణా చర్యలలో భాగంగా గ్లోబల్ ఫండ్స్ కు సపోర్ట్ చెయ్యడమే. ఆపిల్ కాకుండా, మరే ఇతర మొబైల్ కంపెనీలు తమ ఫోన్స్ లో రెడ్ కలర్ వేరియంట్స్ ను "కార్పోరేట్ సామాజిక భాద్యత" (CSR)లో భాగంగా తీసుకుని రాలేదు. కానీ ఆపిల్ మాత్రం ముందుకు వచ్చి తన ఘనతను చాటుకుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ కంపెనీలైన, ఒప్పో, వివో మరియు వన్ ప్లస్ కంపెనీలు రెడ్ కలర్ వేరియంట్లను విడుదల చేసినా, అవి వాటి సేల్స్ పెంచే క్రమంలో భాగంగా వచ్చినవే కాని, CSR లో భాద్యతగా కాదు.

ఇవి పాటిస్తే తక్కువు వెళుతురులోనూ బెస్ట్ క్వాలిటీ ఫోటోస్ మీ సొంతం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐఫోన్-8 , ఐఫోన్-8 ప్లస్ మోడల్స్

ఇప్పుడు 2018 లో, ఆపిల్ ఐఫోన్-8 , ఐఫోన్-8 ప్లస్ మోడల్స్ ను రెడ్ కలర్ వేరియంట్స్ లో ఇండియా లో ఏప్రిల్ 27న లాంచ్ చేసింది. ఆపిల్ "రెడ్"(www.red.org ) తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది , తద్వారా ఫండ్ రైసింగ్ లో భాగంగా ఈ మొబైల్ వేరియంట్స్ ను విడుదల చేయడం జరిగినది. ఈ రెడ్ అను స్వచ్చంద సంస్థ, HIV తో భాదపడుతున్న వ్యక్తులకు సరైన కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని పరీక్షించి, ఎప్పటికప్పుడు మందులు అందిస్తూ, తల్లినుండి పుట్టబోయే శిశువుకు HIV సంక్రమించకుండా చూడడంలో కీలక భాద్యత పోషిస్తుంది. ఈ సంస్థ 2006 లో స్థాపించబడింది. సంస్థ ప్రారంభించిన 11 సంవత్సరాలకు ఆపిల్ ఐఫోన్-7 మరియు 7 ప్లస్ రెడ్ వేరియంట్ ద్వారా తన మద్దతును " రెడ్ " సంస్థకు తెలిపింది. ఇది నిజంగా అభినందించదగ్గ విషయమే.

ఆపిల్ అందించిన నివేదికల ప్రకారం..

ఆపిల్ అందించిన నివేదికల ప్రకారం ఈ రెడ్ వేరియంట్స్ అమ్మకాల ద్వారా, 160 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రెడ్ గ్లోబల్ ఫండ్ కు అందించనున్నట్లు తెలిపింది. ఈ గ్లోబల్ ఫండ్ HIV/ఎయిడ్స్ కార్యక్రమాల కోసం వినియోగించబడుతుంది. ముఖ్యంగా ఘనా, లెసోతో, రువాండా, సౌత్ ఆఫ్రికా, స్వాజిలాండ్, టాంజానియా, కెన్యా, జాంబియాలలో HIV భాధితుల సహాయార్ధం వినియోగించబడుతుంది. ఒకవేళ మీరు వారికి సహాయం చెయ్యాలని భావిస్తే, ఈ రెడ్ కలర్ ఫాన్సీ వేరియంట్ ఐఫోన్-8, 8 ప్లస్ తీసుకోవచ్చు.

రెడ్ కలర్ బాక్ పానెల్ తో..

ఆపిల్ ఐఫోన్-8, 8 ప్లస్ రెండూ రెడ్ కలర్ బాక్ పానెల్ తో రానున్నాయి. ఇది ఐఫోన్-7 , 7 ప్లస్ కు కాస్త భిన్నంగా ఉండనున్నాయి. ఐఫోన్ - 8 మరియు 8 ప్లస్ రెండూ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ తో, గ్లాస్ బాక్ పానెల్స్ కలిగి ఉంటాయి. మిగిలిన అన్ని ఆపిల్ రెడ్ వేరియంట్స్ తో పోలిస్తే, ఈ ఐఫోన్-8 మరియు 8 ప్లస్ ముదురు ఎరుపు రంగులో ఉండనున్నాయి . ఫ్రంట్ పానెల్ పూర్తి నలుపు రంగులో ఉండడం మూలంగా ఈ మొబైల్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంది.

తెలుపు రంగులో

ఒకవేళ మీరు సాధారణ ఐఫోన్-8 లేదా 8 ప్లస్ కొనాలని అనుకుంటే ముందు పానెల్ ఖచ్చితంగా తెలుపు రంగులో ఉంటుంది, కానీ మీరు బ్లాక్ ఫ్రంట్ పానెల్ కావాలని కోరుకున్న ఎడల, మీకు రెడ్ వేరియంట్ మంచి చాయిస్ అవుతుంది అని చెప్పవచ్చు.

64 gb మరియు 256 gb స్టోరేజ్ వేరియంట్లలో..

కానీ ఈ రెడ్ కలర్ వేరియంట్స్ మామూలు ఐఫోన్-8, 8 ప్లస్ లతో పోలిస్తే కాస్త ఖరీదు ఎక్కువగానే ఉండనుంది. ఈ ఐఫోన్-8 మరియు 8 ప్లస్ రెడ్ వేరియంట్ స్పెషల్ ఎడిషన్, 64 gb మరియు 256 gb స్టోరేజ్ వేరియంట్లలో రానుంది. మరియు వీటి ప్రారంభ ధర 67,940 రూపాయల నుండి మొదలవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple iPhone8 and 8 Plus (PRODUCT)RED Special Edition now available in India more news at GizbotTelugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot