12 గంటల్లో రికార్డు సృష్టించిన 'ఐఫోన్ 4ఎస్'

Posted By: Super

12 గంటల్లో రికార్డు సృష్టించిన 'ఐఫోన్ 4ఎస్'

యాపిల్ కంపెనీ ఇటీవల విడుదల చేసి ఐఫోన్ 4ఎస్‌కి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ లభిస్తుందని ఏటీ అండ్ టీ సంస్థ వెల్లడించింది. యాపిల్ కంపెనీ సహావ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ చనిపోయిన తర్వాత యాపిల్ కంపెనీ విడుదల చేయనున్న మొదటి ఉత్పత్తి ఈ ఐఫోన్ 4ఎస్. యాపిల్ ఐఫోన్ 4ఎస్ విడుదల చేసిన పన్నెండు గంట ల్లోనే రికార్డు స్థాయిలో 2 లక్షల ప్రి ఆర్డర్లు వచ్చాయంటే దీనికి మార్కెట్లో ఎంత డిమాండ్ వచ్చిందో దీనిని చూస్తేనే తెలిసిపోతుంది.

యాపిల్ ఐఫోన్ 4ఎస్ కొసం అభిమానులు గత 15నెలలుగా వేచిచూస్తున్న విషయం అందరికి తెలిసిందే. వెరిజాన్ వైర్‌లెస్, స్ప్రింట్ నెక్స్‌టెల్ కార్పొతో కలిసి ఏటీ అండ్ టీ ఐఫోన్‌ మొన్న శుక్రవారం నుండి ఐఫోన్ 4ఎస్ ఆన్ లైన్ ఆర్డర్లను పర్యవేక్షిస్తుంది. ఇక ఐఫోన్ 4ఎస్ ఫీచర్స్ విషయానికి వస్తే హార్డ్ వేర్ అప్ డేట్స్, కొత్త కొత్త సాప్ట్ వేర్స్, వాయిస్ రికగ్నైజేషన్ సాప్ట్ వేర్ సిస్టమ్ లాంటి వాటిని అందించనున్నారని సమాచారం.

పోయిన సంవత్సరం కేవలం ఒక్క ఏటీ అండ్ టీ సంస్ద మాత్రమే ఐఫోన్ సర్వీస్‌ని అందించగా, ఈసంవత్సరం మాత్రం మరో ఇద్దరూ ప్రోవైడర్స్(వెరిజాన్ వైర్‌లెస్, స్ప్రింట్ నెక్స్‌టెల్ కార్పొ) సర్వీసులను అందిస్తున్నారు. గతంలో విడుదల చేసిన ఐఫోన్ 4 ప్రపంచంలో ఫాస్ట్‌గా అమ్మకాలు జరుపుకున్న ఫోన్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఐఫోన్ 4ని విడుదల చేసిన మొదటి మూడు రొజులలో 1.7 మిలియన్ డివైజెస్ అమ్ముడయ్యాయి.

ఇక అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ గనుక చూసినట్లైతే యాపిల్ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 27 నుండి 28 మిలియన్ల వరకు అమ్మకాలు జరిపాయని ఓ సర్వే వెల్లడించింది. ఇక కొత్తగా యాపిల్ కంపెనీ విడుదల చేసిన ఐఫోన్ 4ఎస్ అక్టోబర్ 14న స్టోర్స్‌లలో దర్శనమివ్వనుందని యాపిల్ సిఈవో టిమ్ కుక్ తెలిపారు. ఇక యాపిల్ ఐఫోన్స్‌కి పోటీగా గూగుల్ ఆండ్రాయిడ్, శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్లు మార్కెట్లో విడుదలకు సిధ్దంగా ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot