iPhone 16e ఫోన్ విడుదల.. ఆపిల్ ఇంటెలిజెన్స్, A18 చిప్‌సెట్ సహా సూపర్ ఫీచర్‌లు..!
ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ విడుదల కానుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఐఫోన్ SE 4 గా లాంచ్ కానుందని పెద్ద ఎత్తున లీక్స్ వచ్చాయి. గత వారం ఆపిల్ సీఈవో టిప్ కుక్ కూడా ఫిబ్రవరి 19 వ తేదీన కొత్త ఉత్పత్తిని లాంచ్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే అన్ని ప్రచారాలకు తెరదించుతూ ఆపిల్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 16e పేరుతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేస్తుందని ఆపిల్ వెల్లడించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల పూర్తి వివరాలు.
ఐఫోన్ 16e స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్ (Apple iPhone 16e Launched) 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR (1170*2532 పిక్సల్స్) OLED డిస్‌ప్లేతో విడుదల అయింది. ఈ డిస్‌ప్లే 60Hz రీఫ్రెష్ రేట్ మరియు 800 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ రక్షణను పొందుతుంది. ఫలితంగా ఎక్కువ రోజులపాటు మన్నిక వస్తుందని ఆపిల్ చెబుతోంది.

ఆపిల్ ఐఫోన్ 16e 3nm A18 చిప్‌సెట్, iOS 18 తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 512GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ర్యామ్ పై ఆపిల్ ఎటువంటి ప్రకటన చేయలేదు.
స్టోరేజీ వేరియంట్స్ :
ఈ ఐఫోన్ 128GB, 256GB, 512GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. మరియు ఈ హ్యాండ్‌సెట్ ఆపిల్ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేస్తుందని సంస్థ తెలిపింది. IP68 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. మరియు 167 గ్రాముల బరువును కలిగి ఉంది.
కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు సింగిల్ కెమెరాను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్టుతో 48MP కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాను అమర్చారు. ఈ ఐఫోన్ ఫేస్ ID ను కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ (నానో + eSIM) ను సపోర్టు చేస్తుంది.
ఛార్జింగ్ :
ఐఫోన్ 16e బ్యాటరీ వివరాలను ఆపిల్ వెల్లడించలేదు. అయితే ఫోన్ బ్యాటరీ 18W వైర్ ఛార్జింగ్, 7.5 వైర్‌లెస్ ఛార్జింగ్ ను సపోర్టు చేస్తుందని తెలిపింది. దీంతోపాటు ఈ ఐఫోన్ USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్, Wi-Fi, GPS, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.
ఐఫోన్ 16e ధర, సేల్ వివరాలు :
ఐఫోన్ 16e (iPhone 16e Sale) 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.59900 గా ఉంది. అదే 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.69900, 512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.89900 గా ఉంది. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి ముందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి సేల్ ప్రారంభం కానుంది. కొత్త ఐఫోన్ వైట్, బ్లాక్ రంగుల్లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications







