అదిరిపోయే ఫీచర్స్‌తో యాపిల్ కొత్త 'ఐఫోన్ 4ఎస్'

Posted By: Staff

అదిరిపోయే ఫీచర్స్‌తో యాపిల్ కొత్త 'ఐఫోన్ 4ఎస్'

2007వ సంవత్సరంలో యాపిల్ ఐఫోన్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ చూసిన ఐఫోన్ హావా కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో యాపిల్ సిఈవో పదవికి స్టీవ్ జాబ్స్ రాజీనామా అందించిన తర్వాత ఆ స్దానంలో టిమ్ కుక్ నియమితులైన విషయం తెలిసిందే. టిమ్ కుక్ సిఈవోగా నియమితులైన తర్వాత మొట్టమొదట సారి విడుదల చేసిన కొత్త ఐఫోన్ మోడల్ ఐఫోన్ 4ఎస్. టిమ్ కుక్ చేతుల మీదగా అక్టోబర్ 4, మంగళవారం రోజున కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్ క్వార్టర్స్‌లలో ఈ కార్యక్రమం జరిగింది.

యాపిల్ విడుదల చేసిన ఈ ఐఫోన్ 4ఎస్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలు వన్ ఇండియా పాఠకుల కోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. ఐఫోన్ 4ఎస్‌లో కొత్త యాంటెన్నా, కెమెరా డిజైన్, ప్రాసెసర్‌తో యాపిల్ దీన్ని ఐఫోన్ 4 కన్నా మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఐప్యాడ్ తరహాలోనే ఇందులో ఏ5 చిప్‌ను ఉపయోగించారు. జీఎస్‌ఎం, సీడీఎంఏ.. రెండు నెట్‌వర్క్‌లకు ఇది పనిచేస్తుంది. ఐఫోన్4 కన్నా ఇది ఏడు రెట్లు అధిక వేగంతో పనిచేస్తుంది. 8 మెగాపిక్సెల్ కెమెరా ఇందులో అమర్చారు.

8 గంటల 3జీ టాక్‌టైమ్, ఆరు గంటల బ్రౌజింగ్, తొమ్మిది గంటల పాటు వైఫై, 10 గంటలపాటు వీడియోలు, 40 గంటల పాటు సంగీతాన్ని ఇందులో ఆస్వాదించవచ్చు.16 జీబీ నుంచి 64 జీబీ దాకా సామర్థ్యంలో లభించే దీని ధర 199 డాలర్ల నుంచి 399 డాలర్ల దాకా ఉంటుంది. కొత్త ఐఫోన్ వెర్షన్ రాకతో ఐఫోన్ 4, 3జీఎస్ రేట్లను భారీగా తగ్గించారు. యాపిల్ సీఈవోగా స్టీవ్‌జాబ్స్ వైదొలిగిన తర్వాత ఇది మార్కెట్లోకి వస్తున్న తొలి ఐఫోన్ కావడం గమనార్హం. ఐఫోన్ 4ఎస్‌లో పొందుపర్చిన ‘సిరి’ అనే వాయిస్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌తో వాయిస్ ద్వారానే ఫోన్‌ను ఆపరేట్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.

యాపిల్ కొత్త సీఈవో టిమ్ కుక్.. ఐఫోన్ 4ఎస్‌తో పాటు కొత్త ఐపాడ్ టచ్‌ను కూడా ఆవిష్కరించారు. 8 జీబీ నుంచి 64 జీబీ దాకా సామర్థ్యంలో లభించే దీని ధర 199 డాలర్ల నుంచి 399 డాలర్ల దాకా ఉంటుంది. మరోవైపు, ఐపాడ్ నానో రేట్లను కూడా గణనీయంగా తగ్గించారు. దీంతో 16జీబీ ధర 149 డాలర్లు, 8జీబీ ధర 129 డాలర్లు ఉంటుంది. ఐఫోన్ 4ఎస్ ఈ నెల 14 నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని టిమ్ కుక్ వెల్లడించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot