ఇదిగో యాపిల్ ఐఫోన్6

Posted By:

 ఇదిగో యాపిల్ ఐఫోన్6

యాపిల్ కంపెనీ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. మంగళవారం అర్థరాత్రి (భారత కాలమానంప్రకారం) కాలిఫోర్నియాలోని కుపర్టినో పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో యాపిల్ కంపెనీ చీఫ్ టిమ్ కుక్ కొత్త ఐఫోన్ 6 వర్షన్‌ను రెండు స్ర్కీన్ వేరియంట్‌లలో ప్రదర్శించి యావత్ టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. 4.7 అంగుళాల స్ర్కీన్ వేరియంట్ ఐఫోన్ 6 గాను, 5.5 అంగుళాల స్ర్కీన్ వేరియంట్ ఐఫోన్ 6ప్లస్ గాను మార్కెట్లో లభ్యమవుతాయి. శక్తివంతమైన ఏ8 చిప్‌ను ఈ ఫోన్‌లలో అమర్చినట్లు కంపెనీ తెలిపింది. ఇదే కార్యకమ్రంలో ఐవాచ్‌ను కూడా యాపిల్ ప్రదర్శించింది.

 ఇదిగో యాపిల్ ఐఫోన్6

యాపిల్ ఐఫోన్ 6 ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే). అమెరికా టెలికామ్ ఆపరేటర్లు రెండు సంవత్సరాల కాంట్రాక్టుతో యాపిల్ ఐఫోన్ 6ను సెప్టంబర్ 19 నుంచి విక్రయించనున్నారు. ధరలు ఈ విధంగా ఉన్నాయి. 16జీబి మోడల్ ధర 199 డాలర్లు, 64జీబి మోడల్ ధర 299 డాలర్లు, 128జీబి వర్షన్ ధర 399 డాలర్లు.

 ఇదిగో యాపిల్ ఐఫోన్6

యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ ప్రత్యేకతలు:

ఫోన్ బరువు 172 గ్రాములు, చుట్టుకొలత 158.10 x 77.80 x 7.10 మిల్లీమీటర్లు, ఫోన్ మందం 7.1 మిల్లీ మీటర్లు, 5.5 అంగుళాల తాకేతెర (రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్, 401 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), బ్యాటరీ సామర్థ్యం . ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్ లలో అందిస్తోంది. అమెరికా టెలికామ్ ఆపరేటర్లు రెండు సంవత్సరాల కాంట్రాక్టుతో యాపిల్ ఐఫోన్ 6 ప్లస్‌ను సెప్టంబర్ 19 నుంచి విక్రయించనున్నారు. ధరలు ఈ విధంగా ఉన్నాయి. 16జీబి మోడల్ ధర 299 డాలర్లు, 64జీబి మోడల్ ధర 399 డాలర్లు, 128జీబి వర్షన్ ధర 499 డాలర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple Launches iPhone 6, iPhone 6 Plus. Read more in Telugu Gizbot........
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot