ఐఫోన్ 8 దాని అనుంబంధ మోడల్ అయిన ఐఫోన్ 8 ప్లస్ మార్కెట్లో లాంచ్ అయి దాదాపుగా 6 నెలలు కావస్తోంది. తాజాగా ఈ లేటెస్ట్ ఎడిషన్ ఐఫోన్‌లకు సంబంధించి రెడ్ కలర్ వేరియంట్‌ను యాపిల్ లాంచ్ చేసింది. ఈ స్పెషల్ కలర్ వేరియంట్‌లను అమ్మటం ద్వారా వచ్చే లాభాల్లో కొంత శాతాన్ని దక్షిణాఫ్రికాలో హెచ్ఐవి నిర్మూలణకు వినియోగించనున్నట్లు యాపిల్ తెలిపింది. ఐఫోన్ 8 రెడ్ కలర్ వేరియంట్ లాంచ్‌కు సంంధించిన సమాచారాన్ని మ్యాక్‌రూమర్స్ ముందుగానే వెల్లడించింది. ఐఫోన్ 7కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా మార్కెట్లో లాంచ్ అయిన హల్‌చల్ చేస్తోంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఫోన్ మెప్పించగలిగినప్పటికి డిజైనింగ్ పరంగా పాత పద్థతిని అనుసరించింది. భారీ అంచనాల మధ్య మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 8లో పలు ఆసక్తికర ఫీచర్లు ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాసెసర్ ప్రధాన హైలైట్..
ఐఫోన్ 8కు ప్రధాన హైలైట్ ప్రాసెసర్. ఈ డివైస్‌లో అమర్చిన A11 Bionic chipset సూపర్ స్పీడ్ ప్రాసెసింగ్‌ను ఆఫర్ చేయగలుగుతోంది. చిప్‌సెట్‌లోని సిక్స్-కోర్ సీపీయూ, సిక్స్-కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కోప్రాసెసర్లు హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తున్నాయి. యాపిల్ కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం ఐపోన్ 8లో పొందపరిచిన ఏ11 చిప్‌సెట్ టాప్ స్పీడ్‌లో 25% రెట్టింపు వేగాన్ని ఆఫర్ చేయగలుగుుతంది. మల్టీటాస్కింగ్ సమయంలో ఇధి 70 శాతం అదనపు వేగాన్ని అందుకోగలుగుతంది.
స్టన్నింగ్ డిస్‌ప్లే..
ఐఫోన్ 8కు మరో ప్రధానమైన హైలైట్ డిస్‌ప్లే. ఈ ఫోన్‌లో అమర్చిన 4.7 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే 65.6% స్ర్కీన్ టు బాడీ రేషియోను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేలో వినియోగించిన ట్రో టోన్ టెక్నాలజీ అన్ని సందర్భాల్లో కచ్చితమైన కలర్ బ్యాలన్స్‌ను నిర్థారించగలుగుతుంది.
క్వాలిటీ కెమెరా ఫీచర్స్..
ఐఫోన్ 8కు మరో ప్రధానమైన హైలైట్ కెమెరా. ఈ ఫోన్‌లో సెటప్ చేసిన 12 మెగా పిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరా f/1.8 అపెర్చుర్, అప్టికల్ ఇమేజ్ స్టెబిలైషన్ వంటి ప్రత్యేకతలతో ప్రొఫెషనల్ క్వాలిటీ పోటోగ్రఫీని ఆఫర్ చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 7 మెగా పిక్సల్ కెమెరా f/2.2 అపెర్చుర్‌తో స్టన్నింగ్ సెల్ఫీలను ప్రొవైడ్ చేస్తుంది. ఏ11 బయోనికో ప్రాసెసర్ సహాయంతో ఈ కెమెరాలు నాణ్యమైన క్వాలిటీ పిక్సల్ ప్రాసెసింగ్‌తో పాటు లో-లైట్ ఆటో ఫోకస్ ఇంకా నాయిస్ రిడక్షన్‌ను అందించగలుగుతున్నాయి.
విప్లవాత్మక వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్..
ఐఫోన్ 8కు మరో ప్రధానమైన హైలైట్ వైర్‌లెస్ ఛార్జింగ్. ఈ ఫోన్ 7.5వాట్ స్టాండర్డ్‌తో కూడిన క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీంతో వైర్లు సహాయం లేకుండా ఐఫోన్ 8ను చార్జ్ చేసుకునే వీలుటుంది. ఈ ఫెసిలిటీని కల్పించే క్రమంలో మెటల్ బ్యాక్ ప్యానల్‌ను గ్లాస్ బ్యాక్ ప్యానల్‌తో రీప్లేస్ చేసారు.
164 జిబి డేటాతో ఎయిర్‌టెల్ మరో సరికొత్త ప్లాన్
ఐఫోన్ 8 స్పెసిఫికేషన్స్...
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
ఐఫోన్ 8 ప్లస్ స్పెసిఫికేషన్స్...
గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 5.5 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.