యాపిల్ నుంచి మడతపెట్టుకునే ఐఫోన్!

Posted By: Madhavi Lagishetty

భవిష్యత్తులో ఫోన్లను పేపర్ లా మడతపెట్టేసుకుని పాకెట్లో పెట్టుకోవచ్చు. రానున్న రోజుల్లో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల హవా ఉండనుంది. ఇప్పటికే కొరియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్ధ శాంసంగ్ ఇలాంటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను వచ్చేఏడాది నుంచి మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. నెలక్రితం ZTE ఫోల్డబుల్ అక్సన్ M స్మార్ట్ ఫోన్ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇప్పుడు యాపిల్ కూడా ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది.

యాపిల్ నుంచి మడతపెట్టుకునే ఐఫోన్!

శాంసంగ్, ZTE బాటలోనే యాపిల్ కూడా పయనించనున్నట్లు కనిపిస్తోంది. కంపెనీ ఇప్పటికే పేటెంట్ కోసం USPTOకు దరఖాస్తును కూడా పెట్టుకున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఫోల్డబుల్ ఐఫోన్ చూసే అవకాశం ఉంది. ఫోల్డబుల్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ల రూపకల్పనపై పేటెంట్ సంస్ధ ఐఫోన్ను రూపొందించాలని భావిస్తోంది. ల్యాప్ టాప్, పేపర్ తరహాలో యాపిస్ సంస్థ ఫోల్డబుల్ ఐఫోన్లను తయారు చేయాలని భావిస్తోంది.

ఎలక్ట్రానికి పరికరానికి అనువైన డివైస్ ఉంటుంది. ఇది డివైస్ను ఫోల్డ్ చేసుకునేలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ డివైస్ ఒక ఫ్లెక్సిబుల్ డిస్ల్పేను కలిగి ఉంటుంది.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్, కొరియర్ లాంటి డిజిటల్ జర్నల్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో డివైస్ లపై మెరుగ్గా పనిచేస్తున్నాయి. అయితే భవిష్యత్తులో యాపిల్ కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఫోన్స్ ను రూపొందించేందుకు మార్గాలను అన్వేషిస్తుంది.

ల్యాప్ టాప్ కంప్యూటర్, టాబ్లెట్ కంప్యూటర్, సెల్యులార్ టెలిఫోన్, హ్యాండ్ వాచ్ తోపాటు ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లు(ఉదాహరణకు పోర్టబుల్ డివైస్, హ్యాండ్ హెల్డ్ డివైస్ కావచ్చు) పేటెంట్ గురించి వెల్లడిస్తుంది. కేవలం ఐఫోన్లలో మాత్రమే కాదు అనేక ఇతర యాపిల్ ఉత్పత్తుల్లో కూడా సాంకేతికతను చూశాము.

మంచి ఫీచర్లు ఉన్నా..యూజర్లను ఆకట్టుకోవడంలో విఫలమైన స్మార్ట్‌ఫోన్లు ఇవే !

యాపిల్ కు ఫోల్డబుల్ ఐఫోన్ అనేది సాధ్యమయ్యేదిగా కనిపిస్తోంది. ఎందుకంటే సంస్థ తరచుగా కొన్ని ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. 3డి ఫేస్ రికగ్నైజ్ ఫీచర్ గురించి చాలా చెప్పుకున్నారు. త్వరలో ఐఫ్యాడ్లు, మాక్ బుక్ కూడా రానుంది.

ఫోల్డబుల్ చేసే ఐఫోన్ గురించి చర్చించినట్లయితే...యాపిల్ ఇప్పటికే ఒక పేటేంట్ ను దాఖలు చేసింది. కాబట్టి ప్రొడక్ట్ అనేది తప్పనిసరిగా వస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడైన యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ను మనము చూడగలము.

Read more about:
English summary
The patent reveals that Apple intends to make an iPhone with a display that can open and close like a book.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot