ఐఫోన్ ఎస్ఈ 2పై గురిపెట్టిన ఆపిల్, అంతా సీక్రెట్ !

Written By:

మొబైల్ రంగంలో ఎదురులేని ఆపిల్ సరికొత్తగా వ్యూహంతో ముందుకు దూసుకొస్తోంది. ఐఫోన్ ఎస్‌ఈ విజయవంతం అయిన నేపథ్యంలో దాన్ని సరికొత్త హంగులతో తీర్చి దిద్ది ఐఫోన్ ఎస్‌ఈ 2గా రిలీజ్ చేస్తోంది. 2016 మార్చి నెలలో ఐఫోన్ ఎస్‌ఈని ఆపిల్ విడుదల చేసిన విషయం విదితమే. అన్నీ కుదిరితే ఇది 2018లో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

ఇక మెసెంజర్‌ ద్వారా 4కే క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెంగళూరులో ఐఫోన్‌ ఎస్‌ఈ2..

విస్ట్రోన్‌ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న కూపర్టినోకి చెందిన ఈ దిగ్గజం, బెంగళూరులో ఐఫోన్‌ ఎస్‌ఈ2 స్మార్ట్‌ఫోన్‌ను అసెంబుల్‌ చేస్తుందని రిపోర్టు చేసింది.

Image : iPhone SE

కంపెనీకి చెందిన స్వంత ఏ10 ఫ్యూజన్‌ చిప్‌సెట్‌

ఆన్‌లైన్‌లో వచ్చిన రిపోర్టుల ప్రకారం ఆపిల్‌ ఐఫోన్‌ ఎస్‌ఈ కంపెనీకి చెందిన స్వంత ఏ10 ఫ్యూజన్‌ చిప్‌సెట్‌తో రూపొందుతుందని, రెండు స్టోరేజ్‌ ఆప్షన్లు 32జీబీ, 128జీబీ వేరియంట్లలో ఇది లభ్యం కాబోతుందని తెలుస్తోంది.

Image : iPhone SE

కెమెరా

12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 1700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండవచ్చని సమాచారం.
Image : iPhone SE

ఆపిల్ ఐఫోన్ X లో మాదిరిగానే..

దీంతోపాటు ఇటీవలే విడుదలైన ఆపిల్ ఐఫోన్ X లో మాదిరిగానే ఐఫోన్ ఎస్‌ఈ2లో బెజెల్ లెస్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అయితే దీనిపై ఆపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో చేసే అవకాశం ఉంది.
Image : iPhone SE

ఆపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు..

అయితే దీనిపై ఆపిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్టు తైవాన్‌ ఎకనామిక్‌ డైలీ న్యూస్‌ రిపోర్టు చేసింది.
Image : iPhone SE

ఐఫోన్‌ ఎస్‌ఈ ఫీచర్లు

4 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 640 x 1136 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.84 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ యాపిల్ ఎ9 ప్రాసెసర్, ఎం9 మోషన్ కోప్రాసెసర్
పవర్ వీఆర్ జీటీ7600 సిక్స్‌కోర్ గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్
16/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
1.2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఐఓఎస్ 9.3, సింగిల్ నానో సిమ్
ఎన్‌ఎఫ్‌సీ, 4జీ
4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్, బ్లూటూత్ 4.2
యాపిల్ పే, టచ్ ఐడీ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
1642 ఎంఏహెచ్ బ్యాటరీ

సుమారు రూ. 22 వేలు

కాగా దీని ధర మార్కెట్లో ఇప్పుడు సుమారు రూ. 22 వేలుగా ఉంది..రాబోయే ఫోన్ దీనికన్నా తక్కువ ధరకే వచ్చే అవకాశం ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple may launch iPhone SE 2 in the first half of 2018 Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot