అమెరికా కంటే ఆపిల్ కంపెనీ వద్ద ఉన్న డబ్బే ఎక్కువ!

By Super
|
Apple Campus
శాన్ ప్రాన్సికో: ప్రస్తుతం అమెరికా కోశాగార విభాగం కంటే యాపిల్ కంపెనీ వద్దే డబ్బు ఎక్కువగా ఉన్న సంగతి వెల్లడయ్యింది. తాజా గణాంకాల ప్రకారం, అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వద్ద ఆపరేటింగ్ ఖర్చుల కోసం 73.7 బిలియన్ డాలర్ల సొమ్ము ఉంది. యాపిల్ కంపెనీ అత్యంత తాజాగా వెల్లడించిన ఫైనాన్షియల్ ఫలితాల ప్రకారం కంపెనీ వద్ద 76.4 బిలియన్ డాలర్లు ఉంది. అంటే అమెరికా కోశాగారం కంటే 2.7 బిలియన్ డాలర్లు యాపిల్ కంపెనీ వద్ద ఎక్కువ ఉందన్నమాట!

అమెరికా ప్రతినిధుల సభ అమెరికా అప్పు పరిమితిని 14.3 ట్రిలియన్ డాలర్ల నుండి పెంచేందుకు నిర్ణయం తీసుకోవలసి ఉంది. లేనట్లయితే అమెరీక రోజువారీ వినియోగంతో పాటు అప్పుల నిమిత్తం చేయవలసిన చెల్లింపులను నిలిచిపోతాయి. అంటే అమెరికా అప్పు చెల్లింపులను సమయానికి చేయలేక డిఫాల్టు అవుతుంది. ఇది అమెరికాతో పాటు మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకే శరాఘాతంగా పరిణమిస్తుంది. అమెరికా ట్రెజరీ బాండ్లకు ఇప్పటివరకు ఉన్న AAA క్రెడిట్ రేటింగ్ కూడా అమెరికా కోల్పోవలసి ఉంటుంది.

 

అమెరికా ఇప్పుడు సగటున ప్రతి నెల వసూలవుతున్న రెవిన్యూ కంటే 200 బిలియన్ డాలర్ల విలువైన ఖర్చులు చేస్తోంది. మరోవైపు యాపిల్ కంపెనీ రెండూ చేతులా సంపాదిస్తోంది. దాని ఫైనాన్షియల్ ఫలితాలు ఆ విషయాన్ని తెలుపుతున్నాయి. జూన్ 25తో అంతమయ్యే మూడు నెలల్లో యాపిల్ కంపెనీ నికర ఆదాయం సంవత్సరం ముందు కంటే 7.31 బిలియన్ డాలర్లుగా యాపిల్ ప్రకటించింది. యాపిల్ డబ్బు 75 బిలియన్ డాలర్ల వరకు బ్యాంకుల్లో గానీ లేదా తేలికగా అందుబాటులో ఉన్న ఆస్తుల రూపంలో గానీ ఉంది. ఈ డబ్బుతో యాపిల్ కంపెనీ ఏం చేయనున్నదన్నది పెద్ద ఎత్తున ఊహాగానాలు సాగుతున్నాయి.

 

ఇతర వ్యాపారాల వ్యూహాత్మక స్వాధీనాల (acquisitions) కోసం, టెక్నాలజీ పేటెంట్ల కోసం ఈ సొమ్ముని వినియోగించడానికే యాపిల్ పేరుస్తున్నదని పరిశ్రమల పరిశీలకులు భావిస్తున్నారు. ప్రసిద్ధ బుక్ స్టోర్ అయిన బార్నెస్ అండ్ నోబుల్, ఆన్‌లైన్ సినిమాల వెబ్‌సైట్ ‘నెట్‌ఫిక్స్’, కంపెనీలు యాపిల్, స్వాధీనానికి లక్ష్యంగా పెట్టుకున్న కంపెనీల్లో ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కెనడియన్ సంస్ధ నార్టేల్ నుండి అనేక పేటెంట్లను మైక్రోసాఫ్ట్ తో కలిసి యాపిల్ ఇటీవలే కొనుగోలు చేసింది. దాదాపు 4.5 బిలియన్ డాలర్లు ఖరీదు చేసే 6000 పేటెంట్లను ఇవి కొనుగోలు చేశాయని బిబిసి తెలిపింది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X