ఇప్పుడు యాపిల్ ఐఫోన్‌లను బుయ్‌బ్యాక్ స్కీమ్ పై కొనుగోలుచేయండి!

Posted By:

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్‌ల విక్రయాలను మరింత పెంచే క్రమంలో యాపిల్ కార్పొరేషన్ సరికొత్త బుయ్‌బ్యాక్ స్కీమ్‌ను శనివారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన సమాచారాన్ని ముంబయ్‌కు చెందిన రిటైలర్ మనీష్ కత్రీ తన ట్విట్టర్‌లో  పోస్ట్ చేసారు. మనీష్ అందించిన సమాచారం మేరకు యాపిల్ ప్రవేశపెట్టిన ఈ బుయ్‌బ్యాక్ స్కీమ్ ఐఫోన్ 5సీ, ఐఫోన్ 4ఎస్ 8జీబి మోడళ్లకు వర్తిస్తుంది. బుయ్‌బ్యాక్ స్కీమ్ క్రింద ఈ ఫోన్‌లను కొనుగోలు చేసే క్రమంలో మీ పాత స్మార్ట్‌ఫోన్‌లపై రూ.13,000 వరకు రాయితీని పొందవచ్చు.

ఇప్పుడు యాపిల్ ఐఫోన్‌లను బుయ్‌బ్యాక్ స్కీమ్ పై కొనుగోలుచేయండి!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ ప్రవేశపెట్టిన బుయ్‌బ్యాక్‌ స్కీమ్ ఈ స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది:

BlackBerry Z10 (బ్లాక్‌బెర్రీ జెడ్10)
BlackBerry Q10 (బ్లాక్‌బెర్రీ క్యూ10)
HTC One dual-SIM (హెచ్‌టీసీ వన్ డ్యూయల్ సిమ్)
HTC One mini (హెచ్‌టీసీ వన్ మినీ)
HTC Desire 500 (హెచ్‌టీసీ డిజైర్ 500)
HTC Desire 600 (హెచ్‌టీసీ డిజైర్ 600)
Nokia Lumia 925 (నోకియా లూమియా 925)
Samsung Galaxy S4 (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4)
Samsung Galaxy S III (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3)
Samsung Galaxy Note 2 (సామ్‌సంగ్ గెలాక్సీ నోట్2)
Samsung Galaxy S4 Mini (సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4 మినీ)
Samsung Galaxy Mega 5.8 (సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 5.8)
Samsung Galaxy Mega 6.3 (సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 6.3)
Sony Xperia Z1, (సోనీ ఎక్స్‌పీరియా జెడ్1)
Sony Xperia Z, (సోనీ ఎక్స్‌పీరియా జెడ్)
Sony Xperia Z Ultra (సోనీ ఎక్స్‌పీరియా జెడ్ అల్ట్రా)
Sony Xperia ZR (సోనీ ఎక్స్‌పీరియా జెడ్ఆర్ )
Sony Xperia C (సోనీ ఎక్స్‌పీరియా సీ)

ఇండియన్ మార్కెట్లో ఐఫోన్ 5సీ, 16జీబి వర్షన్ ను రూ.41,900కు విక్రయిస్తున్నారు. 32జీబి వర్షన్ ను రూ.53,500కు విక్రయిస్తున్నారు. ఐఫోన్ 4ఎస్ 8జీబి వర్షన్ ధర రూ 31,500 (అన్ని టాక్సులు కలుపుకొని). యాపిల్ తన కొత్త ఐఫోన్‌లైన 5సీ, 5ఎస్‌లను నవంబర్ 1 నుంచి భారత్ మార్కెట్లో విక్రయిస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot