iPhone Xపై రూ. 20 వేల డిస్కౌంట్ ఎలా పొందాలంటే..?

|

ఆపిల్ 10 వార్షికోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన స్పెషల్‌ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌పై ఇప్పుడూ కంపెనీ రూ.20వేల వరకు డిస్కౌంట్ ని అందిస్తోంది. ఈఫోన్ కొనుగోలుకు ఇదే సరియైన సమయమని కంపెనీ చెబుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌ అందరికీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఐఫోన్‌ ఎక్స్‌ను కొనుగోలు చేసిన ఆరు నెలల అనంతరం ఉచిత స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ను ఇది కల్పిస్తోంది. వీటితో పాటు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి కొత్త ఐఫోన్‌ ఎక్స్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి కంపెనీ కనీసం 20 వేల రూపాయల బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

 

MWC 2018లో దుమ్మురేపిన నోకియా, అదరగొడుతున్న కొత్త ఫోన్లు !MWC 2018లో దుమ్మురేపిన నోకియా, అదరగొడుతున్న కొత్త ఫోన్లు !

బైబ్యాక్‌..

బైబ్యాక్‌..

దీంతో పాటు రూ.20వేల కంటే ఎక్కువగా బైబ్యాక్‌ పొందే కస్టమర్లకు అదనంగా మరో 7వేల రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌, ఐఫోన్‌ 6ఎస్‌, ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌, గూగుల్‌ పిక్సెల్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్‌ వంటి స్మార్ట్‌ఫోన్లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

పైన పేర్కొన్న ఆఫర్లు

పైన పేర్కొన్న ఆఫర్లు

అయితే ఈ ఫోన్లు మామూలు స్థాయిలోనే వాడుతూ ఉండాలి. ఎలాంటి ఫిజికల్‌ డ్యామేజ్‌ ఉండకూడదు. అన్ని యాక్ససరీస్‌ను కలిగి ఉండాలి. పైన పేర్కొన్న ఆఫర్లు ఆపిల్‌ ప్రీమియం రీసెల్లర్స్‌, ఇతర ఎంపిక చేసిన స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

ప్రారంభ ధర 83,499 రూపాయలు
 

ప్రారంభ ధర 83,499 రూపాయలు

గతేడాది సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 8, 8 ప్లస్‌లతో పాటు ఐఫోన్‌ ఎక్స్‌ను ఆపిల్‌ లాంచ్‌ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా ఇది మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఐఫోన్‌ ఎక్స్‌ ప్రారంభ ధర 83,499 రూపాయలు.

 ఓలెడ్‌ డిస్‌ప్లేతో..

ఓలెడ్‌ డిస్‌ప్లేతో..

కాగా ఓలెడ్‌ డిస్‌ప్లేతో కలిగిన ఈ ఫోన్ ఐఓఎస్‌ 11తో రన్‌ అవుతుంది. కంపెనీ సొంత ఏ11 బయోనిక్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5.8 అంగుళాల డిస్‌ప్లే, 2436 x 1125 పిక్సెల్‌ రెజుల్యూషన్‌, ఫేస్‌ఐడీ ఫీచర్‌, 12 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 7 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ షూటర్‌, వీడియో కాలింగ్‌, 64జీబీ, 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్లను ఇది కలిగి ఉంది.

ఐఫోన్ ఎక్స్ ఫీచర్ల విషయానికొస్తే..

ఐఫోన్ ఎక్స్ ఫీచర్ల విషయానికొస్తే..

5.8 అంగుళాల సూపర్ రెటీనా హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, 3డీ టచ్ సిక్స్-కోర్ ఏ11 బయోనిక్ 64-బిట్ ప్రాసెసర్ విత్ 3 కోర్ జీపీయూ, ఎమ్11 మోషన్ కో-ప్రాసెసర్, స్టోరేజ్ ఆప్షన్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్.

ఫుల్ స్ర్కీన్ పై యూట్యూబ్ వీడియోలు

ఫుల్ స్ర్కీన్ పై యూట్యూబ్ వీడియోలు

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలను ఫుల్-స్ర్కీన్ మోడ్‌లో స్ట్రీమ్ చేసుకునేందుకుగాను యూట్యూబ్ సరికొత్త అప్‌డేట్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అప్‌డేట్‌తో 19.5:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తోన్న ఐఫోన్ స్ర్కీన్‌ పై ఫుల్ స్కీన్ మోడ్‌తో వీడియోలను వీక్షించే వీలుంటుంది. ఐఫోన్ ఎక్స్ యూజర్లు iOS యాప్ స్టోర్‌లోకి వెళ్లి యూట్యూబ్ వెర్షన్ 12.43కి అప్‌గ్రేడ్ అవటం ద్వారా ఈ ఫుల్ స్ర్కీన్ మోడ్ వారికి అందుబాటులో ఉంటుంది.

అన్‌వాంటెడ్ బ్లాక్‌బార్..

అన్‌వాంటెడ్ బ్లాక్‌బార్..

యూట్యూబ్ వీడియోలను వీక్షించే సమయంలో ఫుల్-స్ర్కీన్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే వీడియో పై డబల్ టాప్ ఇస్తే చాలు. ఐఫోన్ ఎక్స్ స్ర్కీన్‌ పై ఫుల్ స్కీన్ మోడ్‌తో వీడియోలను వీక్షిస్తున్నప్పుడు అన్‌వాంటెడ్ బ్లాక్‌బార్ కాస్తంత అసౌకర్యానికి గురి చేస్తోంది. డిస్‌ప్లే పై భాగంలో చిన్న కట్‌అవుట్ రూపంలో దర్శనమిస్తోన్న బ్లాక్‌బార్‌లో ఫోన్‌కు సంబంధించిన సెన్సార్‌లతో పాటు ట్రూ డెప్త్ కెమెరాను యాపిల్ నిక్షిప్తం చేసింది.

ఫేస్ఐడీతో యూజర్ ముఖమే పాస్‌వర్డ్

ఫేస్ఐడీతో యూజర్ ముఖమే పాస్‌వర్డ్

ఐఫోన్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లోని 5.8 అంగుళాల ఎడ్జ్-ట-ఎడ్జ్ ఓఎల్ఈడి రెటీనా డిస్‌ప్లే క్రిస్ప్ క్వాలిటీతో వీడియోలను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్‌లో టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా అభివృద్ధి చేసిన ఫేస్ఐడీ ఫీచర్‌ను యాపిల్ పొందుపరిచింది. ఈ సెక్యూరిటీ ఫీచర్‌తో యూజర్ తన ముఖాన్నే పాస్‌వర్డ్‌గా సెట్ చేసుకుని ఫోన్‌ను అన్‌లాక్ చేసే వీలుంటుంది. ఈ FaceID ఫీచర్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే క్రమంలో ట్రుడెప్త్ కెమెరాను యాపిల్ వినియోగించింది.

Best Mobiles in India

English summary
Apple offers whopping Rs 20,000 discount on iPhone X; check how to avail discount More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X