యాపిల్ ఐఫోన్ 6 ప్లస్ దుమారం పై క్లారిటీ ఇచ్చిన యాపిల్!

Posted By:

యాపిల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన లేటెస్ట్ వర్షన్ ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్ పై గత కొద్ది రోజులుగా పెద్ద దుమారమే రేగుతోంది. ఐఫోన్ 6 ప్లస్‌ను జేబులో పెట్టుకుంటే కాస్త వంగుతోందని పలువురు వినియోగదారులను నుంచి ఫిర్యాదలు వస్తున్నాయి. ఈ వ్యవహారం పై యాపిల్ కంపెనీ అధికారికంగా స్పందించింది.

క్లారిటీ ఇచ్చిన యాపిల్!

ఇప్పటి వరకు ఈ సమస్యకు సంబంధించి తమకు 9 ఫిర్యాదులు మాత్రమే అందాయని యాపిల్ కంపెనీ అధికార ప్రతినధి ట్రుడీ ముల్లెస్ తెలిపారు. ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ తయారీకి అత్యంత నాణ్యమైన ఆల్యూమినియమ్ స్టెయిన్‌లెస్ స్టీల్ పదార్థాన్ని ఉపయోగించామని, ఫ్యాంట్ జేబులో ఫోన్ పెట్టుకుని ఎక్కువ సేపు కూర్చున్నపుడు ఆ ఫోన్ పై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల గానీ, టైట్ స్కిన్ జీన్స్ పాకెట్‌లో పెట్టుకున్న సందర్భంలో అధిక ఒత్తిడి కలిగినపుడు మాత్రమే ఫోన్‌లు వొంగే అవకాశముందని ఆయన తెలిపారు.

ఒకవేళ సాధారణ వినియోగం వల్లే ఆ ఫోన్‌లు వంగినట్లయితే వారంటీలో భాగంగా వాటిని విజువల్ మెకానికల్ ఇన్స్‌పెక్షన్‌కు పంపవల్సి ఉంటుందని యాపిల్ తెలిపింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Apple officially responds to the iPhone 6 bending controversy. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot