విదేశాల్లో వాడిపారేసిన ఐఫోన్లు ఇండియాలోకి..

Written By:

బయటి దేశాల్లో వాడేసిన యాపిల్ ఫోన్లను ఇండియాలో అమ్మడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది యాపిల్ సంస్థ. ఇక్కడి జనాలకు సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మడం ద్వారా, భారత్‌లో తమ మార్కెట్ ను మరింత విస్తృతపరుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఫోన్ ఖరీదు చాలా ఎక్కువ కావడంతో, చాలా మంది భారతీయులు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లకే మొగ్గు చూపుతున్నారు. దీన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది యాపిల్ ప్లాన్. టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాజ్యసభకు లిఖిత పూర్వకంగా దీన్ని తెలిపారు. అయితే ప్రభుత్వం, ఈ విషయం మీద ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. మరి ప్రభుత్వం ఆమోద ముద్ర తెలిపితే ముందు ముందు విదేశాల్లో వాడిపారేసిన ఐ ఫోన్స్ ఇండియా మార్కెట్లో హల్‌చల్ చేసే అవకాశం ఉంది.

Read more: రూ. 12వేలకు ఐఫోన్ 5ఎస్: ఐఫోన్ కోసం పసికందును..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మార్కెట్లో యాపిల్ ఐఫోన్‌కి ఉన్న క్రేజ్

మార్కెట్లో యాపిల్ ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ దాని ఖ‌రీదు చూసి చాలామంది దూర‌మ‌వుతుంటారు. అందుకే ఇప్పుడు అలాంటి వారంద‌రి ఆశ‌లు పండే స‌మ‌యం వ‌చ్చింది. మార్కెట్లో ఐ ఫఓన్ ధరలు భారీగా తగ్గనున్నాయి

యాపిల్ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ ఎస్ఈ

మార్కెట్ విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం యాపిల్ కొత్తగా లాంచ్ చేయనున్న ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి రాగానే ఐఫోన్ 5ఎస్ రేట్లు సగానికి తగ్గనున్నాయి. దాంతో ఐఫోన్ ఆశ‌లు నిండే కాలం వ‌స్తోంది. యాపిల్ సంస్థ ఐఫోన్ ఎస్ఈ మోడల్ను మార్చ్ 22న లాంచ్ చేయనుంది.

ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి వచ్చిన అనంతరం

ఐఫోన్ ఎస్ఈ మార్కెట్లోకి వచ్చిన అనంతరం ఇప్పుడు అమెరికాలో 450 డాలర్లుగా ఉన్న ఐఫోన్ 5ఎస్ ధర 225 డాలర్లకు తగ్గనుందని కేజీఐ సెక్యురిటీస్కు చెందిన ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్ మింగ్ చీ క్యో తెలిపారు.

భారత్లో అమ్మకాల వృద్ధికోసం యాపిల్ సంస్థ

భారత్లో అమ్మకాల వృద్ధికోసం యాపిల్ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 5ఎస్ ధరను తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్ ఎస్ఈ మోడల్ రాకతో ఇండియాలో ఐఫోన్ 5ఎస్ ధర మరింత తగ్గనుంది.

అంతా అనుకున్నట్లుగా జరిగితే

అంతా అనుకున్నట్లుగా జరిగితే రానున్న కొద్ది మాసాల్లో ఐఫోన్ 5ఎస్ ఇండియాలో రూ. 12 వేల నుండి 13000 వేలకు లబిస్తుందని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు.

ఈ ధరకు అందించడం ద్వారా

ఈ ధరకు అందించడం ద్వారా ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను యాపిల్ తనవైపు తిప్పుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple plans to sell used iPhones in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot