Home
Mobile

ఫోల్డబుల్‌ ఐఫోన్ కోసం ఆపిల్‌ కీలక నిర్ణయం!.. దిగ్గజ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ దారిలో..!

Foldable iPhone : ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు ఫోల్డబుల్‌ డివైజ్‌లను లాంచ్ చేస్తున్నాయి. ఆపిల్‌ కూడా ఫోల్డబుల్ ఫోన్‌ను విడుదల చేస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా కీలక వివరాలు లీక్‌ అయ్యాయి. టీఎఫ్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ మింగ్‌ చి కూ .. ఫోల్డబుల్ ఐఫోన్‌ గురించి కీలక వివరాలు వెల్లడించారు. ఆపిల్‌ తన ఫోల్డబుల్‌ ఫోన్‌ కోసం శాంసంగ్ డిస్‌ప్లే టెక్నాలజీని ఉపయోగించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్ కోసం శాంసంగ్‌ డిస్‌ప్లే క్రీజ్‌ ఫ్రీ టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆపిల్‌ నిర్ణయం శాంసంగ్‌ సరఫరాదారులకు, ముఖ్యంగా Fine M-Tec ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. ఈ సంస్థ ఫోల్డబుల్‌ ఫోన్లలో స్క్రీన్ మడతలను తగ్గించడానికి కీలకమైన డిస్‌ప్లే మెటల్‌ ప్లేట్స్‌ను అందిస్తుంది.

Foldable iPhone

లేజర్‌ డ్రిల్లింగ్‌ :
ఫైన్‌ M-Tec ఈ ఫోల్డబుల్‌ డిస్‌ప్లే మెటల్‌ ప్లేట్లను 2026 తొలి త్రైమాసికంలో సరఫరా చేస్తుందని తెలుస్తోంది. మొత్తం వాల్యూమ్‌ 13 నుంచి 15 మిలియన్ల మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఒక్కో ప్లేట్ ధర $30 నుంచి $35 మధ్య ఉంటుందని తెలుస్తోంది. ఇందులో సాధారణ పద్ధతులతో పోలిస్తే అధునాతన విధానాలను అనుసరిస్తున్నారు. ఒత్తిడిని సక్రమంగా సర్దుబాటు చేసే విధంగా లేజర్‌ డ్రిల్లింగ్‌ను ఉపయోగిస్తారు.

ముఖ్యంగా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లలో డిస్‌ప్లే మన్నిక అతిపెద్ద సమస్యల్లో ఒకటిగా ఉంది. అయితే ఇప్పటికే శాంసంగ్‌ అనేక ఫోల్డబుల్‌ ఫోన్‌లను లాంచ్ చేసింది. మరియు Fine M-Tec ప్రస్తుతం శాంసంగ్‌కు అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. మరియు ఆపిల్‌ యొక్క 80 శాతం మెటల్ ప్లేట్స్‌ ఆర్డర్‌ను తీసుకొనేందుకు ఈ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సొంత డిజైన్‌ కాకుండా :
ఫలితంగా తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ కోసం సొంత డిజైన్‌పై ఆధారపడకుండా ఉత్పత్తిని ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. అనలిస్ట్‌ మింగ్‌ చి కూ ఆపిల్‌ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ అంచనా ధర వివరాలను కూడా వెల్లడించారు. ఈ వివరాల ఆధారంగా ఈ హ్యాండ్‌సెట్ $2000 నుంచి $2500 గా ఉంటుందని తెలుస్తోంది.

ముఖ్యంగా ఫోల్డబుల్‌ ఫోన్‌ డిజైన్‌ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఆపిల్‌ కూడా డిజైన్, స్థల పరిమితుల కారణంగా టచ్‌ ఐడీని సైడ్‌ బటన్‌పైన తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. దీంతోపాటు ఫేస్‌ ఐడీని తొలిగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

సాధారణ విధానాలతో పోలిస్తే లేజర్‌ డ్రిల్లింగ్ మెరుగైన ఫలితాలను అందిస్తుంది. ఈ ఐఫోన్‌లో ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మెకానికల్ స్ట్రెస్‌ను సమర్థవంతంగా నిర్వహించడం, క్రీజ్‌ రెసిస్టెన్స్‌ సక్రమంగా ఉండేలా చూస్తుంది. ఆపిల్‌ ప్రమాణాలకు సరితూగడమే కాకుండా, విజువల్‌పరంగానూ సజావుగా ఉంటుంది.

ఆపిల్‌ నిర్ణయం ఫైన్‌ M-Tec కు గణనీయమైన ఆదాయాన్ని అందిస్తుంది. ఫోల్డబుల్‌ రంగం విస్తరిస్తున్న కొద్దీ సమస్యలను అదిగమిస్తుంది. ఫోల్డబుల్‌ ఐఫోన్‌ల కోసం ఆపిల్‌ తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్లో దాని స్థానం మరియు ఆర్థిక పరంగా పనితీరును ప్రభావితం చేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple plans to adopt advanced display technology for upcoming Foldable iphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X