ఖుషీ..ఖుషీగా అధినేత!

Posted By: Staff

ఖుషీ..ఖుషీగా అధినేత!

టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంది. ఐఫోన్, ఐప్యాడ్‌ల భారీ అమ్మకాలతో జనవరి-మార్చి త్రైమాసికంలో బ్రాండ్ నికర లాభం ఏకంగా 94 శాతం పెరిగి 11.62 బిలియన్ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో లాభాలు 5.98 బిలియన్ డాలర్లు. తాజాగా మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో అమ్మకాలు 24.66 బిలియన్ డాలర్ల నుంచి 39.18 బిలియన్ డాలర్లకి పెరిగాయి. ఈ వ్యవధిలో 35.1 మిలియన్ ఐఫోన్లను, 11.8 మిలియన్ ఐప్యాడ్‌లను ఆపిల్ విక్రయించింది.

ప్రత్యామ్నాయం ఉందా..?

ఆపిల్ ఐఫోన్ విశ్వవ్యాప్తంగా విజయబాహుటా ఎగరవేసిన తెలిసిందే. ఈ సిరీస్ నుంచి తాజాగా విడుదలైన ఐఫోన్ 4ఎస్, రెండు నెలల వ్యవధిలో 10 మిలియన్ యూనిట్లు అమ్ముడుపోయింది.ఈ గణంకాల బట్టే అర్ధమవుతోంది.. అంతర్జాతీయ మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ రేంజ్ ఏంటో. ఈ హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యామ్నాయం ఉందా..?, అన్న సందిగ్థత పలువురిలో మెదులుతోంది. ఈ ప్రశ్నను సవాల్‌గా స్వీకరించిన విశ్లేషకులు తమదైన కోణంలో పరిశోధనలు జరిపి ఐఫోన్‌కు పలు ఉత్తమమైన ప్రత్యామ్నాయాలను ఎంపిక చేశారు.

ప్రత్యేకంచి, పెద్ద లేదా చిన్నడిస్‌ప్లే, అదేవిధంగా ఫిజికల్ కీబోర్డును కోరుకునే వారికి ఆపిల్ డివైజ్ ఉత్తమమైన ఎంపిక కాదు. ప్రస్తుత ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటే హై క్వాలిటీ డివైజులను ఉత్పత్తి చేసే సంస్థలు చాలానే ఉన్నాయి. ఈ ఏడాది విడుదల కాబోతున్న ఐఫోన్ 5కు సైతం ప్రత్యామ్నాయాన్ని విశ్లేషుకులు ఎంపిక చేశారు. ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్‌లను సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను, ఐఫోన్‌కు ప్రత్యామ్నాయాలుగా భావించవచ్చు.

పైగా పెద్ద డిస్‌ప్లే స్వభావాలు కలిగి ఉండే ఆండ్రాయిడ్ ఫోన్‌లు అన్ని విధాలైన అవసరాలను తీర్చటంలో ముందుంటాయి. శామ్‌సంగ్ గెలక్సీ సిరీస్ నుంచి డిజైన్ కాబడిన గెలక్సీ నోట్, గెలక్సీ బీమ్, గెలక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌లు సంపూర్ణమైన పని వ్యవస్థను కలిగి ఉంటాయి. ఐఫోన్‌కు సమర్ధవంతమైన ప్రత్యామ్నాయాలుగా వీటిని భావించవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.


Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot