మొండికేస్తున్న లక్ష రూపాయల ఐఫోన్ X, తెలివైన సమాధానం ఇచ్చిన ఆపిల్

Written By:

దిగ్గజ మొబైల్ సంస్థ ఆపిల్ కంపెనీ నుంచి వచ్చి రికార్డులు సృష్టిస్తున్న ఐఫోన్ ఎక్స్ ఇప్పుడు అటు కంపెనీకి ఇటు యూజర్లకి షాకిస్తోంది. ఈ ఫోన్ పై ప్రయోగాలు చేస్తున్న విశ్లేషకులకు రోజుకో కొత్త న్యూస్ తెలుస్తోందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఫోన్ అతి చల్లటి వాతావరణంలో పనిచేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి.

ఐఫోన్ల కోసం క్యూలు నిజం కాదా, వెలుగులోకి వచ్చిన వాస్తవాలు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అతి చల్లటి వాతావరణంలో..

మొన్న ఐఫోన్ X మొదటి టెస్ట్‌లో కింద పడినపుడు వెంటనే పగిలిందన్న వార్తలకు తోడు ఇపుడు ఐ ఫోన్‌ అతి చల్లటి వాతావరణంలో పనిచేయడంలేదన్న వార్త ఆపిల్ కంపెనీని కలవరపరుస్తోంది.

ఎలాంటి వాతావారణంలోనైనా..

ఎలాంటి వాతావారణంలోనైనా పనిచేయాల్సిన స్మార్ట్‌ఫోన్‌ తీవ్రమైన శీతల పరిస్థితుల్లో పనిచేయనని మొండికేస్తోందట.

రెండు సెకన్లకే టచ్ స్క్రీన్..

అత్యంత ఖరీదు పెట్టి కొన్న ఐ ఫోన్‌10 అతి చల్లటి వాతావరణంలో పనిచేయడం లేదని కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేశారు. చల్లటి వాతావరణంలోకి వెళ్లిన తరువాత రెండు సెకన్లకే టచ్ స్క్రీన్ పనిచేయలేదని ఒక వినియోగాదారుడు వాపోయాడు.

సమస్యను త్వరలోనే పరష‍్కరిస్తామని..

అయితే ఈ సమస్యపై ఆపిల్‌ వెంటనే స్పందించింది. ఈ సమస్యను త్వరలోనే పరష‍్కరిస్తామని చెప్పింది. ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని,కానీ, కొద్ది సెకన్ల తరువాత పూర్తిగా యథావిధిగా ఉంటోందని ఆపిల్‌ పేర్కొంది. రాబోయే సాఫ్ట్‌వేర్‌ అపడేట్‌లో దీన్ని సవరించనున్నట్టు తెలిపింది.

0-35 డిగ్రీల సెల్సియస్‌ మధ్యనే..

0-35 డిగ్రీల సెల్సియస్‌ మధ్యనే ఈ ఫోన్ వాడాలని ఆపిల్ కంపెనీ వినియోగదారులకు సూచించింది. అతిశీతల, అతి ఉష్ణ వాతావరణంలో ఈ డివైస్‌ బ్యాటరీ కూడా తాత్కాలికంగా బలహీనపడే అవకాశం ఉందని, అయితే సాధారణ వాతావరణంలోకి వచ్చిన తరువాత మళ్లీ మామూలు స్థితికి వస్తుందని చెప్పింది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple Promises Fix for iPhone X Cold Weather Screen Freezes Read more at Gizbot Telugu News
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot