బడ్జెట్ దెబ్బ : ఇండియాలో ఐఫోన్ కొనడం కష్టమే, షాకిచ్చిన ఆపిల్ !

గత వారం కేంద్ర ప్రభుత్వం మొబైల్స్ పై దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆపిల్ ఇండియాలో తన ఐఫోన్ ధరలను భారీగా పెంచేసింది

By Hazarath
|

మొబైల్ దిగ్గజం ఆపిల్ పై బడ్జెట్ దెబ్బ భారీగా పడింది. గత వారం కేంద్ర ప్రభుత్వం మొబైల్స్ పై దిగుమతి సుంకాన్ని 15 నుంచి 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఆపిల్ ఇండియాలో తన ఐఫోన్ ధరలను భారీగా పెంచేసింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన దిగుమతి సుంకం పెంపు మేరకు, టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన అన్ని ఐఫోన్‌ మోడల్స్‌ ధరలను సగటున 3 శాతం మేర పెంచేసింది. పెంచేసింది. ఒక్క ఐఫోన్‌ ఎస్‌ఈ మినహా మిగతా ఐఫోన్ల ధరలన్నీ పెరిగాయి. కాగా ఈ ఉదయం భారత్‌లో తన ఐఫోన్ల ధరలను పెంచుతున్నట్టు ఆపిల్‌ ప్రకటించింది.పెంచిన ఐఫోన్ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

 

4జిబి ర్యామ్‌తో ఇండియాలో దొరుకుతున్న ట్యాబ్లెట్లు ఇవే !4జిబి ర్యామ్‌తో ఇండియాలో దొరుకుతున్న ట్యాబ్లెట్లు ఇవే !

 ఐఫోన్‌ ఎక్స్‌ 256జీబీ వేరియంట్‌

ఐఫోన్‌ ఎక్స్‌ 256జీబీ వేరియంట్‌

పెరగక ముందు ధర రూ.1,05,720
పెరిగిన తరువాత ధర రూ.1,05,720
ఐఫోన్ X ఫీచర్లు
5.8 ఇంచ్ ఓలెడ్ సూపర్ రెటీనా టచ్ స్క్రీన్ డిస్‌ప్లే
2436 x 1125 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆపిల్ ఎ11 బయానిక్ చిప్‌సెట్
3జిబి ర్యామ్, 64/256 ఇంటర్నల్ స్టోరేజి, విస్తరణ సామర్ధ్యం లేదు
12 ఎంపీ ప్రైమరీ రేర్ డ్యూయెల్ కెమెరా, 7 ఎంపీ సెల్ఫీ కెమెరా
ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ సిమ్ సపోర్ట్
2716mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ, బరువు 174 గ్రాములు
డాల్బీ విజన్, ఫేస్ ఐడీ, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ,
ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్

ఐఫోన్‌ 6
 

ఐఫోన్‌ 6

పెరగక ముందు ధర రూ.30,780
పెరిగిన తరువాత ధర రూ.31,900
ఐఫోన్‌ 6 ఎస్‌
పెరగక ముందు ధర రూ.50,660
పెరిగిన తరువాత ధర రూ.52, 100
ఐఫోన్ 6 స్పెసిఫికేషన్‌‍లు:
ఫోన్ బరువు 129 గ్రాములు, చుట్టుకొలత 138.10 x 67.00 x 6.90 మిల్లీ మీటర్లు, ఫోన్ మందం 6.9 మిల్లీ మీటర్లు, 4.7 అంగుళాల తాకేతెర (రిసల్యూషన్ 750x1334 పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్ 8.0 ప్లాట్ ఫామ్, యాపిల్ ఏ8 ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ఐసైట్ రేర్ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, సింగిల్ సిమ్ కనెక్టువిటీ (జీఎస్ఎమ్ నానో సిమ్), ఇతర కనెక్టువిటీ ఫీచర్లు (4జీ,3జీ, వై-పై, జీపీఎస్, బ్లూటూత్, ఎన్ఎఫ్ సీ), సెన్సార్లు (పాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్, బారో మీటర్), 1810 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఐఫోన్ 6 స్మార్ట్‌ఫోన్‌ను యాపిల్ 16జీబి, 64జీబి, 128జీబి స్టోరేజ్ వేరియంట్‌లలో అందిస్తోంది. లభ్యమయ్యే ఫోన్ కలర్ వేరియంట్స్ (సిల్వర్, గోల్డ్, స్పేస్ గ్రే).

16 మోడల్స్‌..

16 మోడల్స్‌..

భారత్‌లో ప్రస్తుతం 16 మోడల్స్‌ను ఆపిల్‌ విక్రయిస్తోంది. ఆపిల్‌ కూడా ఈ ధరల మార్పును ధృవీకరించింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. తన వెబ్‌సైట్‌లో కూడా మారిన ధరలనే పొందుపరిచింది.

మేకిన్‌ ఇండియా ప్రొగ్రామ్‌

మేకిన్‌ ఇండియా ప్రొగ్రామ్‌

దిగుమతి చేసుకునే మొబైల్‌ ఫోన్లపై దిగుమతి సుంకాన్ని పెంచడం ఇది రెండోసారి. మేకిన్‌ ఇండియా ప్రొగ్రామ్‌ను ప్రోత్సహించడం కోసం దిగుమతి చేసుకునే ఫోన్లపై ప్రభుత్వం ఈ సుంకాన్ని పెంచుతూ వెళ్తోంది.

 ఐఫోన్ల ధరల వివరాల మొత్తం లిస్ట్..

ఐఫోన్ల ధరల వివరాల మొత్తం లిస్ట్..

ఇండియాలో ఆపిల్ తన పెంచిన ఐఫోన్ల ధరల వివరాల మొత్తం లిస్ట్ ఇదే..దాదాపు అన్ని మోడళ్లు పెరుగుదలను అందుకున్నాయి. వీటితో పాటు కంపెనీ ఇతర ఉత్పత్తులు కూడా పెరిగాయి.

Best Mobiles in India

English summary
Apple raises prices of all models and watch after duty hike; iPhone SE price unchanged More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X