'ఐవోఎస్ 5.1 బీటా 2 వర్సన్‌'ని విడుదల చేసిన ఆపిల్

Posted By: Super

'ఐవోఎస్ 5.1 బీటా 2 వర్సన్‌'ని విడుదల చేసిన ఆపిల్

 

టెక్నాలజీ గెయింట్ ఆపిల్ డెవలపర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్ 5.1 బీటా 2 వర్సన్‌ని ఇంటర్నెట్లోకి విడుదల చేసింది. దీని వల్ల యూజర్స్‌కు కలిగే ఉపయోగం ఏమిటంటే ఫోటో స్ట్రీమ్‌లో ఉన్న వివిధ రకాల ఇమేజిలను పూర్తిగా డిలిట్ చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న ఆపరేటంగ్ సిస్టమ్‌ ఏమి చేస్తుందంటే ఫోటో తీసుకున్న తర్వాత ఐవోఎస్ డివైజ్‌కు తగ్గ పరిమాణంలో ఆటోమ్యాటిక్‌గా ఫోటో సింక్ అవడం జరుగుతుంది.

ఐతే కొత్తగా విడుదల చేసిన ఐవోఎస్ 5.1 బీటా 2 వర్సన్‌‌లో మాత్రం ఎవరైతే  ఆ ఇమేజిని డిలిట్ చేస్తే, ఆటోమ్యాటిక్‌గా ఆపిల్ ఐవోఎస్ డివైజ్ నుండి డిలీటై పోతుంది. ఇది ఇలా ఉంటే ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి ఐట్యూన్స్ 10.5.2 వర్సన్‌ని కూడా విడుదల చేసే యోచనలో ఉందని సమాచారం. ఐట్యూన్స్ మ్యాచ్‌కి  సరిపడే కొన్ని కొత్త కొత్త ప్రత్యేకతలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.  దీని సహాయంతో సిడిలను ప్లే చేసేటప్పడు వచ్చే ఆడియో ఇబ్బందిని అధిగమించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot